ఫోకస్

ఆశ నిరాశల బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా కాలంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ వచ్చేసింది. అరుణ్‌జైట్లి బడ్జెట్ ఆశనిరాశల మధ్య కొనసాగింది. 21.47 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూనే ఉంది. పార్టీల ఆదాయంపైనా, గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంథానం, రైల్వేల కేటాయింపులు, నైపుణ్యాభివృద్ధికి సంకల్ప నిధి, గృహనిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా తదితర అంశాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంటేనే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని, వనరులను, వివిధ రకాల పద్దుల కింద సంక్షేమానికి, అభివృద్ధికి వెచ్చించడానికి సంబంధించిన అంశంగా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో బడ్జెట్‌లో ప్రజలకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలనే అంశం ప్రధానంగానే రూపకల్పన జరుగుతుంది. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరే సొమ్మును తిరిగి ప్రజలకు ఏ రకంగా కేటాయించలనేదే ముఖ్య ఉద్ధేశ్యం. 1951లో ప్రణాళికల మూల సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది, ఆదాయం పంపిణీ , పన్నులు, సాంఘిక న్యాయం అనేవే మూల సూత్రాలు. ఉన్నత వర్గాలకు, పేద వర్గాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే మూల సూత్రం. ఉన్నత వర్గాలు మరింత పెరుగుతున్నారు, లేని వారు మరింత కుంగిపోతున్నారు, ఆదాయాల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటున్నాయనేది 70-80 శాతం మంది ప్రజల్లో ఉన్న భావన. ఈ హెచ్చుతగ్గులు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం మీద ఆధారపడేవారు ఎప్పటికీ స్థితిమంతులు కావడం లేదు, చిన్న వ్యాపారాలు చేసే వారు తక్కువ కాలంలో స్థిరపడుతున్నారు. ఈ వ్యత్యాసాలు పోవలసిన అవసరం ఉంది. డీమానటైజేషన్ నిర్ణయానికి పూర్తి మద్దతు లభించింది. ఎన్ని గంటలు అవసరమైనా క్యూలలో నిల్చుకున్నారే తప్ప దానిని వ్యతిరేకించకపోవడానికి కారణం ఉన్నత ఆదాయ వర్గాల వారిపై కోపం అర్ధ మవుతోంది. ఉన్నత ఆదాయ వర్గాలకు సంబంధించిన అంశాలపై పన్నులు పెంచి, పేదలకు సబ్సిడీల రూపంలో సాయం అందించడం అనేదే ప్రభుత్వం సహజంగా ఎపుడైనా చేసేది అదే. ఏ వర్గాలైతే తమకు సరైన న్యాయం జరగలేదని భావించారో వారంతా నరేంద్రమోదీకి మద్దతు పలుకుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు అనేక ఆలోచనలతో ఉన్నారు. ఈ బడ్జెట్ వారికి ఊతం ఇస్తుందనేది వారి భావన. దిగువ తరగతి వారి ఆదాయం పెరిగి, వారి జీవన ప్రమాణాలు ఏదో ఒక రకంగా పెంచుతారనే భావన ప్రజల్లో ఉంది. ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత భావం కూడా ఉంది. అందుకు రుజువులు వారు వ్యక్తం చేయకపోయినా, అలాంటి అభిప్రాయంతో ఉన్నారనేది సత్యం.

-ప్రొఫెసర్ జి.సూర్యనారాయణ మాజీ చైర్మన్, ఎపిపిఎస్‌సి