ఫోకస్

బతుకు చిత్రం మారేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించింది. 21.47 లక్షల కోట్లతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక బిల్లును ఆమోదించడం, రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, ప్రణాళిక, ప్రణాళికేతర విధానాలను పక్కన పెట్టడం ఈ బడ్జెట్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అరికడతామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకానికి 48వేల కోట్ల కేటాయించారు. అనేక కొత్త పథకాలకు బాట వేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1,87,023 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించారు. రాజకీయ పార్టీలకు సైతం జవాబుదారీ తనాన్ని ఈ బడ్జెట్ పెంచింది. విరాళాలు 20వేలకు మించితే తప్పనిసరి లెక్క చూపించాలని కూడా నిర్దేశించారు. నగదు రూపంలో విరాళం రెండు వేల రూపాయిలు మించరాదు. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపులు 35 శాతం పెరిగాయని కూడా ఆర్ధిక మంత్రి వెల్లడించారు. 5 కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలకు ఒక శాతం కార్పొరేట్ పన్ను మినహాయింపు లభించింది. రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామాలకు ఇంటర్నెట్‌కు 10వేల కోట్లు కేటాయించారు. వౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,96,135 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 250 ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాల ఏర్పాటుకు 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రానున్నాయి. 20వేల మెగావాట్ల సామర్ధ్యం ఉన్న సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నిధులను కేటాయించారు. ఇలా అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి.
తాజా బడ్జెట్‌తో దేశంలో ఆర్ధిక వ్యవహారాల్లో పెను మార్పే రానుంది. బడ్జెట్‌లో వడ్డనలు, రాయితీల ఆధారంగా ధరలు పెరుగుదల, తరుగుదల సహజం. దీనికి తోడు రాష్ట్రాల బడ్జెట్ కూడా ధరల్లో మార్పునకు వీలుంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆర్ధిక నివేదికను ప్రభుత్వం పార్లమెంటు ముందుంచి ఆమోదం పొందుతుంది. స్వాతంత్య్రం సిద్థించిన నాటి నుండి బడ్జెట్‌ను కేంద్రం సమర్పిస్తోంది. స్వాతంత్య్ర భారతంలో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న ఆర్ కె షణ్ముగం చెట్టి సమర్పించారు.
బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక మంత్రి హోదాలో అరుణ్‌జైట్లి నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి బడ్జెట్‌ను మరింత ముందుకు తెచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెట్టారు. ఉద్యోగులు ఆదాయపన్నుకు సంబంధించి రాయితీలపై ఎదురుచూసినట్టే ఆర్ధిక మంత్రి మినహాయింపులు ప్రకటించారు. 2.5 లక్షల నుండి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఐదు శాతం పన్ను ప్రకటించారు. ప్రస్తుతం అది 10 శాతంగా ఉంది. ఆదాయ పన్ను స్లాబులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. అన్ని రంగాలకు చెందిన వారు ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలను ప్రకటించనుందో అనే ఉత్సుకత తీరిపోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదవారికే లాభం జరుగుతుందని ప్రధాని ప్రకటించిన దరిమిలా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై చర్చ మొదలైంది.
జూలై 1 నుండి వస్తు, సేవల పన్ను అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో సేవా పన్ను, ఎక్సైజ్ డ్యూటీల ప్రస్తావన కూడా ముగిసింది. ఈసారి రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్‌లోనే మిళితం చేయడం మరో ముఖ్యాంశం. అమరావతి వాసులకు మూల ధన లాభాల పన్ను మినహాయింపు ప్రకటించడంతో పాటు భూ సేకరణలో సహకరించిన రైతులకు సైతం పన్ను మినహాయింపును ఆర్ధిక మంత్రి ప్రకటించారు.