ఫోకస్

ఉత్పాదక రంగం బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీసాల వల్ల భారత్‌కు నష్టమే. కానీ భారత్ ఏం చేయగలదన్నదే మనముందున్న ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలపై విధించిన ఆంక్షలు సరైనవికావు. దీన్ని అక్కడి కోర్టు కూడా సమర్థించలేదు. ట్రంప్ అమెరికా దేశాధినేతగా కొంతమేరకు డిగ్నిటీ మెయింటెన్ చేయాలి. అలాకాకుండా ఏడు దేశాల ప్రజలను నిషేధించడం ఆయన స్థాయికి తగింది కాదు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ప్రతీదేశం అలాంటి నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి కుంటుపడుతోంది. వలసవాదుల ముసుగులో మస్లింలను, ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించడం సరైంది కాదు. ట్రంప్ నైతిక విలువల పరిధి దాటింది. హూందాతనం కనిపించడం లేదు. అమెరికాలోని ఐటి కంపెనీల్లో భారతీయులే అధిక శాతం ఉన్నారు. వేతన పరిమితి 1,30,000 డాలర్లుగా నిర్ణయించి ఉద్యోగ వీసాలపై దెబ్బతీశారు. అయితే ఇది అక్కడి దేశ పౌరుల ఒత్తిడా, లేదా ట్రంప్‌ది సొంత నిర్ణయమా అన్నది తేలాలి. వీసాలపై ప్రకటించిన నిబంధనలపై ఫెయిర్ పాలసీ ఉండాలి తప్పా చట్టాల లొసుగులు, స్థానిక ఆందోళనలు కారకం కాకూడదు. అమెరికాకు అక్రమంగా వచ్చేవారిపై ఆంక్షలు విధించాలి తప్ప చదువు, ఉద్యోగంకోసం వచ్చేవారిపై నిబంధనలు సడలించాలి. ఇదిలావుంటే ఈ విషయంపై భారత్ ఏం చేస్తున్నట్టు, భారత్‌ను పాలించిన వారంతా ఉత్పాదక రంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రజాసంక్షేమ పథకాలపై దృష్టిసారిస్తూ వచ్చారు. ఉద్యోగాలకోసం అమెరికా వెళ్లిన భారతీయుల పరిస్థితిపై సమీక్షించాలి. భారతీయులకు ఎలాంటి నష్టం ఏర్పడకుండా చూడాలి. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత్ ఉత్పాదక రంగాన్ని నిర్వీర్యం చేయకుండా ఉత్పాదక రంగాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రజాసంక్షేమ పథకాలపై దృష్టిసారిస్తూనే ఉత్పాదక రంగం అభివృద్ధిని కాంక్షించాలి.

-జి రాజారెడ్డి లోక్‌సత్తా, ఫైనాన్స్ కమిటీ చైర్‌పర్సన్