ఫోకస్

అమెరికాకే అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌తోసహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నిపుణులు, ఉద్యోగుల సేవలు, మేధావుల సేవలు అమెరికాకే అవసరం. అమెరికాకు వచ్చేవారికి సంబంధించిన హెచ్1-బి వీసాలపై ఎలాంటి నిషేధం విధించినా అది అమెరికాకు వచ్చే మేధావులకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం కలిగించదు. మేధావులు అమెరికా కాకపోతే ప్రపంచంలో తమకు అనుకూలమైన దేశానికి వెళతారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ప్రొఫెషనల్స్ (డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్తవ్రేతలు, ఇతర రంగాల్లో నిపుణులు) అమెరికా విజయయాత్రలో కీలకభూమిక పోషిస్తున్నారు. ఈ మేధావులను వద్దనుకుంటే అమెరికా ప్రగతికి ఆటంకం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రపంచలో నేడు మేధోమథనం జరుగుతోంది. మేధావుల సేవలు వాడుకునే దేశాలు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా(యుఎస్‌ఎ..యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా)-యుఎస్‌ఎస్‌ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్) మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచేది. ప్రపంచంలోని దేశాల్లో చాలా వరకు ఈ రెండు దేశాల్లో ఒకదాని వెనుక నడిచేవి. యుఎస్‌ఎస్‌ఆర్ విడిపోయిన తర్వాత అమెరికా (యుఎస్‌ఎ)కు ఎదురులేకుండా పోయింది. భారత్‌తోసహా ప్రపంచంలోని అనేక దేశాల నుండి యువత అమెరికాకు వస్తోంది. అమెరికా ప్రజలు తమ దేశం అభివృద్ధికోసం ఎలా శక్తివంచనలేకుండా పనిచేస్తున్నారో, భారత్‌తోపాటు ఇతర దేశాల నుండి అమెరికా వచ్చిన యువతీ, యువకులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తున్నారు. అందువల్ల ఇతర దేశాలకు చెందిన ప్రొఫెషనల్స్‌కు ఎలాంటి అడ్డంకులు పెట్టినా అది అమెరికా అభివృద్ధికి అటంకం కలిగించినట్టే అవుతుంది. హెచ్1-బి వీసాలపై అమెరికా దేశానికి వస్తున్నవారు నిర్ణీత సమయం కన్నా ఎక్కువ కాలం అమెరికాలోనే ఉండిపోతున్నారు. వారి వారి వ్యక్తిగత అవసరాలతోపాటు అమెరికా అభివృద్ధికి వారి సేవలు దోహదపడుతున్నాయి. అంటే హెచ్1-బి వీసాలపై అమెరికాకు వస్తున్న వారివల్ల దేశ ప్రగతి సాధ్యమవుతోంది.
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో తనదైన శైలిని చూపిస్తున్నారు. వివిధ రంగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఉండాలనేది ఆయన అభిప్రాయం కావచ్చు. ఒక దేశం అధినేత తన దేశానికి చెందినవారు బాగుండాలని, ఉద్యోగాల్లో తమ దేశానికి చెందినవారికే ప్రాధాన్యత ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అయితే అదే సమయంలో ఇతర దేశాలకు చెందిన మేధావులకు ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉంటుంది. హెచ్1-బి వీసాలపై ఎలాంటి కట్టుబాట్లు పెట్టినా అది అమెరికా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

- డాక్టర్ నందకిషోర్, బాక్ట్సర్, కెంటకీ