ఫోకస్

ఇబ్బంది ఉండక పోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీసాలపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ పని చేస్తున్న మన దేశ ఐటీ ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చనే నిపుణులు చెబుతున్నారు. హెచ్-1బీ వీసాలతో ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇబ్బందేమి ఉండకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏడాదికి ఒక్కో దేశానికి 7 శాతం కంటే ఎక్కువ ఇచ్చేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన తొలగింపు వల్ల భారతీయులకే మేలు జరుగుతుందన్న మరో వాదన కూడా ఉంది. హెచ్-1 బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో భారతీయులు అధికంగా ఉన్నారు. మన దేశానికి చెందిన టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ఐబిఎం, గూగుల్, కాగ్నిజెంట్ వంటి విదేశీ సంస్థలలో కూడా మన దేశ నిపుణుల సంఖ్య అధికంగా ఉంది. వీసాల చట్ట సవరణతో నైపుణ్యత ఉన్న వారికి అధిక వేతనాలు లభిస్తాయని విశే్లషిస్తున్నారు. దీని వల్ల తక్కువ వేతనాలు ఇచ్చే ఐటీ కంపెనీలకు ఇబ్బంది తప్ప ఉద్యోగులకు నష్టం ఉండదని చెబుతున్నారు. మరోవైపు స్టార్టప్ కంపెనీలకు వీసాల మంజూరీలో అవకాశాలు మెరుగు పడే అవకాశం ఉందంటున్నారు. అలాగే అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవనే చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా, భారత్‌కు ఉన్న సంబంధాల దృష్టా మన దేశానికి చెందిన ఉద్యోగులకు గానీ, విద్యార్థులకుగానీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే భావిస్తున్నాం. ఇతర దేశాల నుంచి అమెరికాకు వస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భారతదేశం లక్ష్యం కానేకాదని చెప్పవచ్చు. అలాంటప్పుడు భారత్‌కు చెందిన ఉద్యోగులుకానీ విద్యార్థులు కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- డాక్టర్ రాజ్ సిద్ధార్థ రిటైర్డు ప్రొఫెసర్, కాకతీయ మెడికల్ కాలేజి