ఫోకస్

మనకే మేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా విధిస్తున్న ఆంక్షలపై మనదేశంలో అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఉపాధికోసం అమెరికా వెళ్లిన భారతీయుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. హెచ్1బి వీసాపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనివల్ల కనీస వేతనం 1.30 లక్షల డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నికర ఆదాయం 60వేలు, 80వేలు డాలర్లు పొందుతున్న వారంతా తమ వేతనం 1.30 లక్షల డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది భారతీయులకు శుభసూచకమే. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలవల్ల అక్కడ సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. గతంలో 2009లో సంక్షోభం తలెత్తిన సమయంలో అనేకమంది భారతీయులు ఉద్యోగాలు వదిలిపెట్టి భారత్‌కు వచ్చేసారు. అయితే ఆ సవాళ్లను ఎదుర్కొన్నవారు అక్కడే ఉపాధి వెతుక్కొని జీవనోపాధి పొందారు. ఇపుడు కూడా కంగారుపడి నిర్ణయం తీసుకుంటే పప్పులో కాలేసినట్టే! ప్రస్తుతం అమెరికాలోని ఐటి నిపుణుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయులు ఉండటంవల్ల భారత్‌కు మేలు కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. హెచ్1బి వీసాలు కొత్తగా తీసుకున్న వారికి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి అనుమతించనున్నారు. అయితే ట్రంప్ వచ్చాక సిక్కులను పోల్చుకునేందుకు సిక్కులు టర్బన్‌లు ధరించాలని వాటిని పంచిపెట్టారు. ముస్లిం దేశాల్లో అతివాద దేశాలైన ఏడు దేశాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక మెక్సికోకు, అమెరికాకు మధ్య గోడ నిర్మిస్తామని పేర్కొన్నప్పటికీ దానివల్ల అమెరికాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సాధారణంగా అమెరికాలోని యాపిల్ ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యాపిల్ పండ్లకు మెక్సికన్లను కార్మికులుగా ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ అక్కడ గోడ నిర్మిస్తే తక్కువ ధరకు కూలీలు లభించే అవకాశాలు ఉండవు. దీనివల్ల అమెరికా వ్యాపారులకు అది అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్‌కు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. గతంలో వై2కె విషయంలోను, అమెరికాలో సంక్షోభం తలెత్తినపుడు దానివల్ల భారత్‌కు మేలు కలిగింది. ఇపుడు పరిస్థితులను పరిశీలించిన భారత్‌కు ఎక్కువగా మేలు కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.