ఫోకస్

ఆందోళన అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్1బి వీసాలపై నెలకొన్న అనిశ్చితిపై విద్యార్థులు, ఐటిరంగ నిపుణులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెచ్1బి వీసాల జోలికొస్తే ఎక్కువ నష్టం వాటిల్లేది అమెరికాకె, హెచ్1బి వీసాలతో అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారిలో కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల నెలకొన్న అలజడి తాత్కాలికంగానే ఉంటుంది. హెచ్1బి వీసాలను వలసేతరవీసా సాంకేతిక నిపుణులకు ఇస్తారు. మన దేశం నుంచి లక్షలాది మంది విద్యార్థులు, ఐటి, వైద్య, ఇంజనీరింగ్ రంగానికి చెందిన నిపుణులు అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. గూగుల్, ఐబిఎం, యాహూ, టిసిఎస్, కాగ్నిజెంట్ ఇంకా అనేక పెద్ద కంపెనీలకు ఇక్కడినుంచి ఉద్యోగులు వెళ్లి అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా చట్టాలకు లోబడి మాత్రమే మన దేశానికి చెందిన లక్షల సంఖ్యలో నిపుణులు అమెరికాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. జిఆర్‌ఇ, టోఫెల్, జిమ్యాట్ లాంటి పరీక్షల కోచింగ్‌లకు లక్షల సొమ్మును వెచ్చించి చదివి పాసై అమెరికాకు వెళ్లి ఉన్నత విద్యను చదివే విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. అక్కడ ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న ఇతర దేశాల వారికి నెలకు 60 వేల డాలర్లను ఇస్తున్నారు. ప్రస్తుతం సవరించిన చట్టం ప్రకారం 1.30 లక్షల డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఒక ఉద్యోగం ఖాళీ అయితే, ముందుగా అమెరికన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి దేశానికి తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాలు చేసుకునే హక్కుంటుంది. ఈ విషయాన్ని కాదనలేం. కాని ఇంతకాలం అనుసరిస్తున్న ఉదార విధానాలను ఒక్కసారి విడనాడి కఠిన వైఖరిని అవలంభించడంవల్ల ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడిన వారికి తీవ్రమైన ఇక్కట్లు ఎదురవుతాయి. మన దేశం నుంచి పెద్ద ఎత్తున డాక్టర్లు, ఐటి నిపుణులు అమెరికాకు వెళ్లి ఆ దేశ ఆర్థిక స్థితిని సుంపన్నం చేశారు. ఇప్పుడు హెచ్1బి వీసాలను రద్దు చేసినా, జారీ చేయడంలో కఠిన తరం చేసినా లేదా ఇప్పటికే కల్పిస్తున్న వెసులుబాటును ఉపసంహరించుకున్నా అమెరికాకు వెళ్లిన భారతీయ నిపుణులు, విద్యార్థులకు కొంతకాలం సంక్షోభాలు తప్పవు. కాని ఈ మెరిట్‌ను తీసుకునేందుకు ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు పోటీపడుతున్నట్లుగా సమాచారం వస్తోంది. పైగా మన దేశంలో కూడా సరళీకృత ఆర్థిక విధానాలవల్ల అభివృద్ధి వేగవంతమవుతోంది. భారత్‌కు వచ్చి స్వావలంభనకు కృషి చేసినా మంచిదే.