ఫోకస్

దాడులు దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్‌పై పాక్ ముష్కరులు దాడులు జరపడం దురదృష్టకరం. రెండు దేశాల పాలకులు సంయమనంతో ఉండాలి అయితే పాక్ సైన్యం రాజకీయాలను శాసిస్తోంది. అందుకే దాడులు జరుగుతున్నాయి. మన దేశం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నది. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తూ, ఇదివరకే వివిధ దేశాల్లో పర్యటించారు. పాకిస్తాన్‌తోనూ మైత్రి కొనసాగేందుకు ప్రధాని మోదీ ముందడుగు వేశారు. తాజాగా ప్రధాని మోదీ ఆకస్మాత్తుగా పాక్‌నూ సందర్శించారు. భారత్-పాక్‌ల మధ్య మరింతగా సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఇరు దేశాల పాలకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే వారం సుహృద్భావమైన వాతావరణంలో చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చల ప్రక్రియకు బ్రేక్ పడరాదు. చర్చల ద్వారా ప్రతి సమస్యకూ పరిష్కారం లభిస్తుంది. మహా యుద్ధాలే ఆగిపోతాయి.
కాబట్టి ఈ సమయంలో ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళాలి. ఇరు దేశాల పాలకులు చర్చలు జరిపి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూస్తారని ఆశిస్తున్నాను.
ఇకపోతే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలూ ఖండించాలి. తీవ్రవాదాన్ని కూకటివేళ్ళతో అణిచి వేయాలి. ఉగ్రవాదం అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుంది. ఏ దేశంలో తీవ్రవాదం, నక్సలిజం ఉంటుందో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయి. కుటుంబాలు నాశనమవుతాయి. యువత పెడదారి పడుతుంది. ఫలితంగా సమాజం అల్లకల్లోలమై అభివృద్ధి, ప్రజా సంక్షేమం నిలిచిపోతుంది. ఏ దేశమూ, ఏ సమాజమూ, ఏ మతమూ అలజడులు జరగాలని, అభివృద్ధి కుంటుపడాలని కోరుకోదు. అయితే కొంతమంది ముష్కరులు చేసే ఇటువంటి దురాగతాల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
పఠాన్‌కోట్‌లో కూంబింగ్ ఆపరేషన్ చేసి, ఉగ్రవాదులను మట్టుపెట్టిన సైన్యాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలి. దురదృష్టవశాత్తు సైన్యంలో కొంతమంది అధికారులు, జవాన్లు వీరమరణం పొందారు. వారికి దేశ ప్రజలు శాల్యూట్ చేయాలి.

- జాహెద్ అలీ ఖాన్ ఎడిటర్, సియాసత్ ఉర్దూ దిన పత్రిక