ఫోకస్

డాలర్ కాంక్షలపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే అమెరికాలో ప్రవేశించే విదేశీ నిపుణులపై ఆంక్షలు విధించారు. దాంతో భారత్‌సహా పలు దేశాలు ప్రధానంగా ఐటి రంగంలో నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. అంతా ఇపుడు హెచ్-1బి వీసాల గురించే చర్చ జరుగుతోంది. వాస్తవానికి అమెరికా 40 రకాల వీసాలను జారీ చేస్తుంటుంది. అవికాకుండా మరికొన్ని స్పెషాలిటీ వీసాలుకూడా ఇస్తుంది. అయితే అన్నింటిలో కేవలం విద్యార్థులకు ఇచ్చే ఎఫ్-1, స్పెషాలిటీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్-1బి వీసా గురించే అంతా చర్చిస్తున్నారు. రానురాను అమెరికాలో ప్రవేశించేందుకు కొన్ని వీసాలపై సడలింపులుకూడా రానున్నాయి. అలాగే కొన్ని వీసాలపై ఆంక్షలు పెరగనున్నాయనేది నిపుణుల అంచనా.
అమెరికా బిజినెస్, టూరిస్టులకు, వర్క్ పర్మిట్లకు, విద్యార్థులకు, ఎక్సేంజ్ ఆఫర్ కింద, ట్రాన్సిట్ కింద , డొమెస్టిక్ ఎంప్లాయిస్‌కు, జర్నలిస్టులకు వేర్వేరు వీసాలను ఇస్తుంది. విజిటర్లకు జె-1, భార్యను తీసుకువెళ్లాలంటే కె-1, ఎఫ్‌టిఎ కింద హెచ్-1బి1, స్టూడెంట్ డిపెండెంట్లకు ఎఫ్-2, ఎం-2, టెంపరరీ వర్కర్లకు హెచ్-2ఎ, హెచ్-2బి, విజిటర్లకు బి-2, అధికారులకు-ఎ, క్రీడాకారులకు బి-1 వీసాలు ఇస్తుంది. అయితే ఉపాధి అవకాశాలు అమెరికాలో ఉన్నవారికే దక్కేలా ఇతర దేశాల నుండి వచ్చేవారిపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇవి దాదాపు ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల నుండి అమెరికా వెళ్లాలనుకునేవారికి ప్రధానంగా తూర్పు ఆసియా దేశస్థులకు ఇబ్బందికరంగానే తయారైంది. ప్రతి ఏటా భారత్ నుండి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుండి అమెరికాకు ఉపాధి, విద్యావకాశాలకోసం వెళ్తున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక అంచనా ప్రకారం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడు కావడం, ప్రతి 12 మందిలో ఒకరు తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లినవారే కావడం గమనార్హం. అన్ని ప్రాంతాల్లో ఇదే నిష్పత్తిలో భారతీయులు లేకపోయినా మొత్తంమీద అమెరికాలో భారతీయుల ఉనికి తోసిపారేయలేం. ఇప్పటికే అమెరికాలో స్థిరపడినవారు, స్థిరపడుతున్నవారు, భవిష్యత్‌లో స్థిరపడదామని ప్రణాళికలు వేసుకున్న వారికి ట్రంప్ ఆలోచనలు ఇబ్బందికరంగా తయారయ్యాయి. మున్ముందు ఎలాంటి ఆంక్షలు ఎదురవుతాయనే భయం వారిని పీడిస్తోంది. భారత్ నుండి వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి వైద్యులుగా, ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా పనిచేస్తున్నవారు ఎందరో ఉన్నారు. కంపెనీల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి కొంతకాలం పనిచేయాలనుకునే వారికి కూడా కొత్త నిబంధనలు చిక్కులు తెచ్చిపెట్టనున్నాయి. గ్రీన్ కార్డు కోసం పెట్టుకున్న ఆశలు ఆవిరి కానున్నాయి. అమెరికాలో పరిస్థితులు, వీసా ఆంక్షలపై కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.