ఫోకస్

నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమైనా విపత్కర పరిస్థితుల్లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినపుడు లేదా ప్రజాస్వామ్యానికి ప్రమాదస్థాయిలో విఘాతం కలిగే సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి సాధ్యమైనంత త్వరితగతిన సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాల్సి ఉంది. అపుడే ప్రజాస్వామ్యం పదికాలాలపాటు వర్థిల్లుతుంది. సాధారణంగా నాయకత్వ మార్పిడి దశలోనే వివాదాలు రచ్చకెక్కుతుండటం ఎంతోకాలంగా చూస్తున్నాం. ఆ సమయాల్లోనే గవర్నర్ల పాత్ర ఎంతో కీలకమైంది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గితే మరింత ప్రమాదం ముంచుకొస్తుంది. సిఎం పదవిని ఆశించే వారికి ఏ స్థాయిలో మద్దతు ఉన్నదో స్వయంగా గుర్తించే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాతే ఆ మెజార్టీ సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవి నధిరోహించేందుకు అనుమతించాలి. ఒక్కసారి శాసనసభలోఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో 50 శాతం దాటి హాజరయినప్పుడు మెజారిటీ ఉంటే సమస్య ఉండదు. కానీ లేనపుడు తక్షణం శాసనసభను సమావేశపరచి బలపరీక్షకు సిద్ధమైతే అటో ఇటో తేలుతుంది. తమిళనాడులో ముఖ్యమంత్రి సెల్వం రాజీనామా చేసిన తర్వాత అధికారపక్ష లెజిస్లేచర్ పార్టీనుంచి లేఖ అందిన వెంటనే ఆలస్యం చేయకుండా సభను సమావేశపరిచి ఉంటే బాగుండేది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ముందుగా ఎవరైనా ఊహించగలరా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1983నాటి గవర్నర్ రాంలాల్ కేంద్రం మాటవిని బలపరీక్ష లేకుండానే నాదెండ్ల భాస్కరరావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి మళ్లీ ఎన్టీఆర్‌కు పగ్గాలు అప్పగించి రాంలాల్‌ను తొలగించడం జరిగింది. అసలు ఆమె చరిత్రలో ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం కూడా ఇదే ప్రథమం
-వడ్డే శోభనాద్రీశ్వరరావు
మాజీ పార్లమెంటు సభ్యులు

-వడ్డే శోభనాద్రీశ్వరరావు