ఫోకస్

కొన్ని సమస్యలు వారే తెచ్చిపెడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాష్టప్రతికి ప్రతినిధిగా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు చక్కదిద్దేందుకు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం జరుగుతుంది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పెరిగినప్పుడు, అధికారంకోసం గొడవలు వచ్చినప్పుడు గవర్నర్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం గవర్నర్ పదవిలో నియామకం అయ్యేవారు కేంద్రం చెప్పినట్టు నడచుకోవాల్సి వస్తోంది. ఒక రాష్ట్రంలోని ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఓట్లు వేసినవారికి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కేంద్రం రాజకీయంగా లబ్ధి పొందేందుకు వీలుగా గవర్నర్‌కు సలహాలు ఇస్తుంటుంది. దాంతో సదరు రాష్ట్రం హక్కులను కాపాడటం మరిచిపోయి, రాజకీయంగా లబ్ధిచేకూరే విధంగా ప్రవర్తిస్తున్నారు. సంబంధిత రాష్ట్రం సమస్యలను పరిష్కరించాల్సిన గవర్నర్, స్వయంగా సమస్యలను తెచ్చిపెడుతున్నారు. తమిళనాడు పరిస్థితి చూడండి. మెజారిటీ ఉన్నవారిని వదిలేసి, బలం లేనివారికే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్న నాయకుడికి అధికారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల సంక్షోభం ఏర్పడింది. అంటే రాజ్యాంగాన్ని, నైతిక విలువలకు ఎంతమాత్రం విలువ ఇవ్వని వారికే గవర్నర్ బాధ్యత ఇస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గవర్నర్‌పై గౌరవం రోజురోజుకు తగ్గిపోతోంది. రాజ్యాంగ రక్షణ గవర్నర్ బాధ్యత. అయితే గవర్నర్లుగా నియామకం అవుతున్నవారిలో చాలావరకు కేంద్రంలో అధికారంలో ఉండే రాజకీయ పార్టీలకు చెందినవారినే నియమిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినవారు, పదవుల కోసం నానాగొడవ చేసేవారు, రాజకీయ పార్టీలో దశాబ్దాల తరబడి వివిధ హోదాలు నిర్వహించేవారిని కేంద్రం గవర్నర్‌గా నియమిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు, యువతకు ఆదర్శంగా ఉండేవారిని గవర్నర్ పదవిలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. గవర్నర్ పదవికి వనె్న తెచ్చేవారు, రాజ్యాంగాన్ని రక్షిస్తూ, రాజకీయాలకు అతీతంగా ఉండేవారిని గవర్నర్‌గా నియమించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌గా ఏం జరుగుతోంది? పక్కాగా రాజకీయాలు చేసేవారినే నియమిస్తున్నారు. ప్రధాని ఎవరైనాసరే, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, నైతిక విలువలను ప్రోత్సహించాల్సి ఉండగా, అనైతిక విలువలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంపై సవారీ చేయకుండా రాష్ట్రం హక్కులను కాపాడేవారికి ప్రాధాన్యత ఇవ్వకుండా హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ఈ విధానంలో సమూల మార్పులు రావలసి ఉంది.
- ప్రొఫెసర్ హరగోపాల్
సామాజిక శాస్తవ్రేత్త

- ప్రొఫెసర్ హరగోపాల్