ఫోకస్

రాష్ట్రం వచ్చినా మారని పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. పేద పిల్లలకు విద్య అందనంత దూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు అనేకం కూలిపోయే విధంగా ఉన్నాయి. వాన వస్తే పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సి వస్తున్నది. ఎన్నికల ముందు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలపై తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ బిడ్డలను దోపిడీ చేస్తున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలు మూతపడతాయని, యజమాన్యాలు పలాయనం చిత్తగించాల్సి వస్తుందని, అధికంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిఆర్‌ఎస్ నాయకులు బీరాలు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డూఅదుపూ లేకుండా ఫీజులు బాదుతున్నాయి. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క విద్యా సంస్థపైనా చర్య తీసుకోలేదు. కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల పెత్తనం కొనసాగుతూనే ఉన్నది.
పేదలకు విద్యనందించాలని, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చాలన్న ధ్యాసే రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండాపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తుల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారాన్ని ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. పాత భవనాలను ఖాళీ చేయించి కొత్త భవనాల్లోకి పాఠశాలలను మార్చడం, కొన్ని భవనాలకు మరమ్మత్తులు చేయించడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్త భవనాల నిర్మాణం కూడా చేయడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పోటీపడే రోజులు రావాలి. ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించినా, అవి నీటిమూటలే అవుతున్నాయి. ఇది చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం అనేది స్పష్టమవుతోంది. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు విద్యా హక్కు (రైట్ టు ఎడ్యుకేషన్)ను అందరికీ కల్పించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్‌ద్వారా మైనర్ బాలబాలికలు కార్ల అద్దాలు తుడిచి డబ్బులు అడుక్కోవడం, ఆకలి అవుతున్నదని కడుపు చూపించడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి? పాఠశాలలకు వెళ్ళే వయస్సులో అడుక్కుంటుంటే చర్యలు తీసుకోని, తీసుకోలేని ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పే బంగారు తెలంగాణ ఎప్పుడు వస్తుంది?

- ఎం. అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షుడు, తెలంగాణ యువజన కాంగ్రెస్