ఫోకస్

ప్రైవేటు విద్యకు లక్ష్మీ కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారంగం బజారులో అమ్మే సరకులా మారింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ వాటిలో కనీస వసతులు లేకుండా అర్హత లేని ఉపాధ్యాయులతో తమ వ్యాపారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క తరగతికి 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండవలసిన గదిలో 50 నుంచి 70 మందిని ఉంచుతూ విద్యార్థులను మానసిక వేదనకు గురిచేస్తున్నారు. చాలా విద్యాసంస్థల్లో కనీసం ఆట స్థలాలు కూడా లేవు. కేవలం పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రికల్ మీడియాలో ప్రకటనలు చూపిస్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతూ కేవలం తరగతి గదులకు మాత్రమే విద్యార్థులను పరిమితం చేస్తున్నారు. టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్ అనే ప్రత్యేకమైన పేర్లతో ఐఐటి అంటే తెలియని విద్యార్థులకు చిన్నప్పట్నుంచి ‘నీట్’ అని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యా హక్కును అమలుపరచడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్కూలు నడపవలసి ఉంది. కార్పొరేట్ కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిపైన ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. దీన్నిబట్టి మనకు ఈ కళాశాలల పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థవౌతుంది. ఇవి కేవలం ధనార్జన కేంద్రాలుగా మారాయి తప్ప విద్యాసంస్థలుగా మారలేదు. ఇక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకు వస్తే చాలా కళాశాలల్లో పిహెచ్‌డి పూర్తి చేసిన ప్రొఫెసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే చాలా కళాశాలల్లో సరైన ల్యాబ్‌లు కానీ, వసతులు కానీ లేవు. ఇక విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే ఇప్పటికి చాలా డిపార్ట్‌మెంట్‌ల్లో పోస్టులు ఖాళీగా ఉన్నవి. విద్యార్థులకు చదువు చెప్పే ప్రొఫెసర్లు లేకుండా పోయారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా డిపార్టుమెంట్లలో పరిశోధనలు చేసే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి కారణం విశ్వవిద్యాలయాల్లో సరైన ప్రొఫెసర్స్ లేకపోవడమే.

- చిట్యాల నాగిరెడ్డి, ఎబివిపి