ఫోకస్

ఫీజులు పెరిగాయి.. ప్రమాణాలు తగ్గాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పాలకుల ప్రకటన కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. 30 ఏళ్లుగా లేని ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఇప్పుడు బాగుంది.. అంటే నమ్మశక్యం కాదు. ప్రభుత్వ పాఠశాలలనే ఎత్తివేయాలనే యోచనలో ఉన్న ప్రభుత్వాలు ప్రస్తుతం పాఠశాలల పనితీరు మెరుగుపడిందని అంటున్నారు. ఇంతకాలం పాఠశాలలపై పర్యవేక్షణ లోపంవల్ల విద్యాప్రమాణాలు తగ్గాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెరగడంతో సామాన్య, పేద వర్గాలు ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా వెళ్లిన ప్రభుత్వం తన ఆలోచనను ఉపసంహరించుకొని ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తుండటంతో కొంతమేరకు ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడ్డాయనే చెప్పవచ్చు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు విపరీతంగా పెరిగి విద్యాప్రమాణాలు తగ్గాయి. ప్రైవేటు పాఠశాలలన్నీ వ్యాపారపరంగా మారాయి. ఫీజుల నియంత్రణ లేదు. సౌకర్యాల లేమితో విద్యాబోధన సక్రమంగా జరగడం లేదు. ప్రైవేటు పాఠశాలల నిర్వహణ కార్పొరేట్ స్థాయికి చేరడంతో సామాన్య, పేదవర్గాల వారికి ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని, ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని అనడం ప్రామాణికం కాదు. విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుపై తగు ప్రాధాన్యతనిస్తూ విద్యాబోధన జరిగినప్పుడే విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో రాణించగలుగుతారు. కానీ ప్రస్తుతం విద్యారంగం నిర్బంధమైంది. ఫీజులను నియంత్రించేందుకు, పరీక్షల నిర్వహణకు ఒక రెగ్యులేటరీ అథారిటీని నియమించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళుతున్నారా లేదా అనే తనిఖీలులేవు. చాలాచోట్ల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో కనీస సౌకర్యాల ఏర్పాటుతోపాటు ఉపాధ్యాయుల కొరత తీర్చాలి. ఉన్నత ప్రమాణాలతో విద్యబోధన జరగాలి. ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాలి.

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా, కన్వీనర్