ఫోకస్

రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల్లో అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు, పరీక్షల నిర్వహణకు ఒక రెగ్యులేటరీ అథారిటీని నియమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యా రంగంలో అనిశ్చితి నెలకొంది. పాఠశాలలపై నియంత్రణ లేదు. అనేకచోట్ల పాఠశాలల్లో వసతి సదుపాయాలు లేవు. టీచర్లను నియమించినా వారు పాఠశాలలు ఉన్న గ్రామాల్లో ఉండడం లేదు. ప్రాంతీయ మీడియంలో చదివేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళుతున్నారా లేదా అనే తనిఖీలులేవు. చాలాచోట్ల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యా సంస్థలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు పుంజుకున్నాయి. గత 30 సంవత్సరాలుగా ప్రైవేట్ రంగంలో పాఠశాలల హవాపెరగడం, ఆంగ్ల మీడియంలో చదివేందుకు విద్యార్థులు ఉత్సాహం కనపరచడంతో ప్రభుత్వ పాఠశాలల వైభవం తగ్గింది. ఈ రోజు ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించి విద్యార్థులు చేరుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే జనవరి, ఫిబ్రవరిలోనే కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు ముగుస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకోసం ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాయి. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నా, సరైన ఉపాధ్యాయుల నియామకం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యను సరైన దారిలోకి తీసుకురావాలంటే పరీక్షలు, ఫీజులపై నియంత్రణ అథారిటీ ఉండాలి. పాఠశాలల గుర్తింపు ఇవ్వాలన్నా, రద్దు చేయాలన్నా, ఉపాధ్యాయుల నియామకం, వారిపై చర్యలు, పరీక్షల నిర్వహణ అన్ని అధికారాలను రెగ్యులేటరీ అథారిటీకి ఇవ్వాలి. దీనివల్ల సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాను. ప్రభుత్వ పరిధిలో పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలు పెంచాలంటే సరైన వసతి సదుపాయాలు ఉండాలి. బాలబాలికలకు చాలాచోట్ల మరుగుదొడ్డి సదుపాయాలు లేవు. పాఠశాలలు కూలిపోతున్న భవనాల్లో ఉన్నాయి. ఇప్పటికీ చెట్లకింద చదువులు కొనసాగుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు పాఠశాల విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలి.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత