ఫోకస్

మార్పు రాకపోతే నిరుపయోగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

21వ శతాబ్దంలో విద్య స్వరూపంలో చాలా మార్పు వచ్చింది, ఆనాడు అక్షరమే ప్రధానం, నేడు భావన ప్రధానం. ఈనాడు డిజిటల్ యుగం వచ్చింది. ప్రతికాలంలో కూడా ఆ యుగంలో జరిగిన ఆవిష్కరణలు విద్యారంగంపై ప్రభావం చూపుతాయి. ఈ యుగంలో డిజిటల్ ప్రభావం విద్యారంగంపై చూపాల్సిన అవసరం ఉంది. ఆనాడు చదువులు ఆరేళ్ల తర్వాత మొదలయ్యేది, కాని నేడు మూడేళ్ల ప్రాయంలోనే చదువు మొదలవుతోంది. మూడు-ఆరేళ్ల మధ్య కాలం చాలా ప్రధానమైంది. ఆ వయస్సులో విలువలు ప్రధానంగా ఉండాలి, సమాచారం ప్రధానం కారాదు. ఉపాధ్యాయుని, స్కూల్ యాజమాన్యం వైఖరి, ఏ మేరకు ఆప్యాయంగా ఉంటారు, ఏ మేరకు కేర్ తీసుకుంటారో కూడా తెలుసుకోవాల్సిన రోజులు ఇవి. ప్రేమానురాగాలను యాజమాన్యాలు ప్రదర్శించాలి, అంతేతప్ప చెబితే సరిపోదు, పుస్తకాల ద్వారానే మొత్తం జ్ఞానం వచ్చే రోజులు పోయాయి. ఈనాడు 3డి వచ్చింది, ఆనాడు 3డి ఎక్కడిది? కాని ఆనాడు 3డి కోణంలో నాటి టీచర్లు అనేక ఇబ్బందులు పడికూడా చూపించేవారు. ఎన్నో అవకాశాలు నేడు ఉన్నాయి. నేడు ఒక మ్యూజియంకు తీసుకువెళ్లి కూడా పాఠం చెప్పవచ్చు. నేడు ఇన్ఫర్మేషన్ అసెస్‌మెంట్‌లో కూడా మార్పు వచ్చింది. పదో తరగతి తర్వాత కేవలం పుస్తకాలలోని అంశాలనే అడగాలనే భావనకూడా పోయింది. విద్యార్థులకు క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా ప్రధానం. థింకింగ్ వల్లనే ఉన్నత విద్యకు మూలం ఏర్పడుతుంది. చదువు స్వరూపం డిజిటల్ యుగంలో మారిపోయింది. ఉద్యోగానికి, ఉపాధికి అనుగుణంగా మార్పు రాకపోతే నిరుపయోగం అయిపోతుంది. విద్యార్థులపై భారం పడకూడదనే సుప్రీంకోర్టు భావన చాలా ప్రగతిశీలమైనది, దానిని మనం అందుకోలేకపోతున్నాం. తాజా పరిణామాల ఆధారంగా మార్పు చేసుకుంటూ మనం విద్యార్థులను తయారుచేయకపోతే గత శతాబ్దానికి అవసరమయ్యే విద్యార్థి తయారవుతాడే తప్ప, ముందు శతాబ్దానికి అవసరమైన విద్యార్థి తయారుకాడు.

- డాక్టర్ చుక్కా రామయ్య శాసన మండలి మాజీ సభ్యుడు