ఫోకస్

మోయలేని భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాల విద్య సవాలక్ష సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, తల్లిదండ్రుల సమస్యలతోపాటు పాఠశాల కమిటీలకు, అధికారులకు, సిబ్బందికికూడా అనేక రకాల సమస్యలున్నాయి. అనునిత్యం విద్యార్థుల సమస్యలపై ప్రధానాంశంగా చర్చ కొనసాగుతోంది. టీచర్ల రిక్రూట్‌మెంట్, పనివేళలు, పనిభారం, వేతనాలు, పర్యవేక్షణ సిబ్బంది, సహసిబ్బంది లోపం, సిబ్బంది కొరత, తల్లిదండ్రులకు ఫీజుల భారం ఇలా చెప్పుకుంటూపోతే లెక్కలేనన్ని సమస్యలున్నాయి. పిల్లలకు ఫీజులు, పుస్తకాల భారం, అడ్మిషన్లు, టెస్టులు, బ్యాగుల భారం, పనివేళల సమస్యలు కూడా ఉన్నాయి. ఆడుతూ పాడుతూ చదువుకోవల్సిన వయస్సులో మోయలేని భారం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మోతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు పుస్తకాల మోతతో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రెండు మూడు అంతస్థులున్న పాఠశాలల తరగతి గదుల్లోకి వెళ్లే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. పుస్తకాల భారంపై 2006లోనే చట్టం చేసినా దాని అమలుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పిల్లల బ్యాగుల భారాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలను చూడాలని తాజాగా ఆదేశించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కూళ్లలో పుస్తకాల బరువును తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది. ఇంత జరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో అధికారులు మాత్రం ఈ అంశంపై దృష్టిసారించడం లేదు. విద్యార్థి శరీర బరువులో పుస్తకాల భారం 10 శాతానికి మించకూడదనేది చిల్ట్రన్ స్కూల్ బ్యాగు యాక్టు చెబుతోంది. కాని ప్రస్తుత భారం 35 శాతం వరకూ ఉంటోంది, దాంతో పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కండరాల సమస్యలు, వెన్నుపూస ఒంగిపోవడం, వెన్నునొప్పి వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇరు రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటి మంది పిల్లలు పాఠశాల విద్య పరిధిలో ఉన్నారు. రెగ్యులర్ సిలబస్ పుస్తకాలతో పాటు డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్టు, జికె, కంప్యూటర్, అసైన్‌మెంట్లు, డైరీ పుస్తకాలతోపాటు క్లాసు వర్కు, హోం వర్కు పుస్తకాలు, దాదాపు ప్రతి సబ్జెక్టుకూ రెండు మూడు నోట్‌బుక్స్, అట్లాస్, డిక్షనరీ, స్పోర్ట్సు డ్రెస్ ఇలా బ్యాగు ఒక ప్రపంచంగా మారిపోతోంది. యుకెజి చదివే విద్యార్థుల బ్యాగు బరువు సగటున 14 కిలోలు ఉండగా, మూడో తరగతి విద్యార్థి బ్యాగు బరువు దాదాపు 22 కిలోలు ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమస్యలతో పాటు ప్రధానంగా స్కూలు బ్యాగు సమస్యలపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.