ఫోకస్

నిరుద్యోగులను నిరాశ పర్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరుద్యోగ సమస్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగానే ఉంది. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. సుమారు 1.42 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయాలి. ఏపీపీఎస్సీ 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించి నాలుగున్నర వేల ఉద్యోగాలకోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 982 గ్రూప్-2 పోస్టులకోసం పరీక్షను నిర్వహించింది. తెలంగాణలోనూ లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సిఎం కేసిఆర్ ప్రకటించారు. కానీ ఆచరణలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా తీవ్ర కాలయాపన సాగిస్తున్నారు. నిరుద్యోగులు ఆయా సర్వీసు కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రైవేటు సెంటర్లలో కోచింగ్ తీసుకున్నారు.. తీరా ఉద్యోగాల ప్రకటనలు అనుకున్నవిధంగా రాకపోవడంతో ఉద్యమిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రెండువేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలో లక్షల పోస్టుల్ని భర్తీ చేయడం లేదు. ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ఉద్యోగాల భర్తీకోసం ప్రకటన చేయాలి. కాలయాపన చేయడంద్వారా నిరుద్యోగులను నిరాశపర్చవద్దు. ఖాళీ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలి.

- ఎ.రవిచంద్ర, పిడిఎస్‌యు ఏపీ అధ్యక్షుడు