ఫోకస్

బాబొచ్చారు.. జాబులేమయ్యాయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన హామీపై ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామనే ప్రధానమై అంశంగా ఉంది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కాని ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది. యువకుల కలలు కల్లలయ్యాయి. నిరుద్యోగులకుభృతి లేదు. యువకులకు మాయమాటలు చెప్పి నయవంచకత్వంతో ఓట్లు వేయించుకుని మోసం చేసిన ఘనత టిడిపికి దక్కుతుంది. ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ ఉద్యోగావకాశాలు లేవు. నిరుద్యోగులు ఎక్కువ. బతుకు తెరువుకోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకు వెళ్లి తక్కువ వేతనాలపై పనిచేస్తున్నారు. చంద్రబాబు విశాఖలో సిఐఐ సదస్సులో 4.5 లక్షల కోట్ల రూపాయల ఎంఒయూలు కుదిరినట్లు గొప్పలు చెప్పారు. కాని ఇంతవరకు పరిశ్రమలు రాలేదు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెంచుకున్నారు. సచివాలయంలో అన్ని ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరుగుతోంది. ఈ ఉద్యోగాలు ఎంతకాలం పర్మినెంట్‌గా ఉంటాయో తెలియదు. ఇవి శాశ్వతమైన ఉద్యోగాలు కావు. తెలంగాణలో కూడా అంతే. ప్రత్యేక రాష్ట్రం అవతరిస్తే 1.37 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలపై ఆధారపడి ఉంది. కాని ఏమైంది. ఈ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలీ జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి పోరాడిన కెసిఆర్, కోదండరామ్‌ల మధ్య విబేధాలు తలెత్తాయి. నిరుద్యోగ ర్యాలీని భగ్నం చేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ రోజు భారతదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్ధితులవల్ల అమెరికా, తదితర దేశాలకు వలసలు వెళ్లిన ఇంజనీర్లు, రకరకాల వృత్తి ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా సమాజంలో నిరుద్యోగ నిర్మూలనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి, పబ్లిక్ సర్వీసు కమిషన్లను బలోపేతం చేయాలి. ఆర్థిక శాఖ తమ వద్దకు వచ్చిన పోస్టుల భర్తీ ప్రతిపాదనలకు వెంటనే పచ్చజెండా ఇవ్వాలి. కాలయాపన చేయరాదు. ప్రభుత్వాధినేతలు కూడా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తదితర పోస్టులను వెంటనే భర్తీచేయాలి. నిరుద్యోగులకు వివిధ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగాల ప్రకటన ఇచ్చినప్పుడు శిక్షణ ఇవ్వాలి. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నిరుద్యోగ భృతిపై ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోని పక్షంలో త్వరలో కార్యాచరణ ఉంటుందని వైకాపా స్పష్టం చేసింది. పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేంతవరకు భృతి ఇవ్వాలి. సమాజంలో అశాంతి, తీవ్రవాదం వైపు యువకులు మళ్లేందుకు నిరుద్యోగం ప్రధాన కారణం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు మసలుకోవాలి. బ్యాంకులు, పరిశ్రమలు స్థాపనకు యువకులకు రుణాలు ఇవ్వడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అసమానతలు తొలగించాలి.

-ఎస్ సలాం బాబు అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం