ఫోకస్

కాలయాపన తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధిలో పోటీపడుతూ పాలన సాగిస్తున్నారే తప్ప నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా పాలకులు కృషి సల్పడం లేదు. నిరుద్యోగులు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే స్వయం ఉపాధి వైపు దృష్టిసారించడం మేలు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నిరుద్యోగ సమస్య ఒక్కటే కాదు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలు ప్రజాసంక్షేమంకోసం ఎన్నో పథకాలు రూపొందించారు. కానీ అవి అమల్లోకి రాకుండా పోతున్నాయి. ఉచిత విద్య, ఉపాధి, నీరు వంటి ముఖ్య అంశాలు పాలకులను పట్టిపీడిస్తున్నాయి. వీటి పరిష్కారం కోసం గవర్నర్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. ఉపాధి అవకాశాల పేరిట ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయ. ఉభయ రాష్ట్రాల్లోనూ నిరుద్యోగ భృతి పేరుతో పాలన సాగుతోంది. వికలాంగులు, వితంతు, వృద్ధాప్య పెన్షన్ల మాదిరిగా నిరుద్యోగ భృతి కల్పిస్తామనే ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో యువత జీవన భృతికోసం ఓ కార్యాచరణతో ముందుకెళ్తోంది. వలసల నివారణే ధ్యేయంగా పరిశ్రమల స్థాపనకు కృషి జరుగుతోందని, విదేశీ పెట్టుబడులు లక్షలాది కోట్లుగా వస్తున్నాయన్న ప్రభుత్వాల ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండేళ్లుగా రెండు రాష్ట్రాల మంత్రులు పలు దేశాలకు వెళ్లి తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. కాని ఇంతవరకు పరిశ్రమలు రాలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి బదులు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ నిర్మూలనకు కృషి జరగాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఆర్ధిక శాఖ తమ వద్దకు వచ్చిన పోస్టుల భర్తీ ప్రతిపాదనలకు వెంటనే పచ్చజెండా ఊపాలి.

- జగన్‌మోహన్ మెట్ల, లోక్‌సత్తా, తెలంగాణ కన్వీనర్