ఫోకస్

ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అబద్ధాల ఎన్నికల ప్రణాళికలు విడుదల చేసి, అమాయక ప్రజలను, నిరుద్యోగులను, రైతులను నమ్మించి, ఆకర్షించాయి. వరుసగా రెండు టర్మ్‌లు (దాదాపు పదేళ్ళు) అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే మరో పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా కొత్తగా, మరింతగా మేలు జరుగుతుందేమోనన్న భ్రమతో ప్రజలు ఓట్లు వేసి మోసపోయారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు, నిరుద్యోగులు తాము తప్పు చేశామని బాధ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో 180 హామీలు ప్రకటించింది. అందులో 102 హామీలు చాలా ప్రధానమైనవి. అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రణాళికలో హామీల జల్లు కురిపించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ఆకర్షించారు. ఫలితంగా రెండు రాష్ట్రాల యువకులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలూ మోసపోయారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన సమయానికి లక్ష పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఈ రెండున్నర ఏళ్ళలో భర్తీ చేసింది కేవలం ఐదు వేల ఉద్యోగాలే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా, ఇప్పటివరకు లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు లక్షా 55 వేల వరకు ఉన్నట్లు అనధికార సమాచారం.
మేము అధికారంలో ఉన్నప్పుడు చాలావరకు ఖాళీలను భర్తీచేశాం. ఉదాహరణకు నేను విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్తు శాఖలో ఇంజనీర్లు, ఇతర ఖాళీలు సుమారు 10 వేల వరకు భర్తీ చేయడం జరిగింది. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి మూడేళ్ళు కావస్తున్నది. ఇప్పటివరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో యువకుల్లో ఆందోళన పెరుగుతున్నది. ఇలాగే సంవత్సరాలు గడిచిపోతుంటే ఉద్యోగ నియామకాలకు ఉన్న వయో పరిమితి దాటుతుందేమోనన్న ఆందోళన రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతలో మొదలైంది. కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూడా పచ్చి అబద్ద్ధాలతో ప్రజలను మోసగించింది. అధికారం చేపట్టి సగ భాగం పూర్తి చేసుకున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు.

- మహ్మద్ షబ్బీర్ అలీ ప్రతిపక్ష నేత, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి