ఫోకస్

ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడివుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాలు కళ్ల ముందు కనిపిస్తున్నా రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాననేది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. కానీ కొందరు నాయకులు కెసిఆర్ హామీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టిడిపి, టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక అందరికీ అందుబాటులో ఉంది. దీన్ని ఒకసారి చదివితే ఆ హామీ ఎవరిదో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రం అయినా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. తెలంగాణలో ఒక అంచనా ప్రకారం మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి. తెలంగాణ ఏర్పడే నాటికి రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. కొత్త రాష్ట్రం, ఇంకా ఉద్యోగుల విభజన కూడా జరగలేదు. అయినప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాల నియామకాలు తెలంగాణలో జరుగుతున్నాయి. అయరా నిరుద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక ఐటి కంపెనీలు వచ్చాయి. గూగుల్ లాంటి పెద్ద కంపెనీ తెలంగాణపై విశ్వాసంతో వచ్చింది. టి-హబ్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. రెండేళ్ల క్రితం టిఎస్‌పిఎస్‌సి ఏర్పాటైంది. ఇప్పటికే 34 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 24 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటికే 5,936 పోస్టులను భర్తీ చేశారు. కొత్త ఉద్యోగులు విధుల్లో కూడా చేరారు. ప్రభుత్వం 28వేల పోస్టులను భర్తీ చేసి, మరో 24వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. 20వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్థీకరణ ప్రక్రియ సాగుతోంది. పోలీసు శాఖలో 11,820 ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామకాలు జరిగాయి. విద్యుత్ శాఖలో 2345 పోస్టులు, సింగరేణిలో 4340 పోస్టులు, ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి 3,944 పోస్టుల నియామకం ప్రక్రియ జరుగుతోంది. డిఎస్‌సి ద్వారా పదివేల పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలోనైనా తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే చెప్పండి. రాజకీయ ఉద్దేశాలతో విమర్శలు చేస్తున్నారు... ఆందోళనకు దిగుతున్నారు. అయితే యువత వీటిని పట్టించుకోవడం లేదు. వేలాది మంది యువత పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్నారు. ప్రభుత్వంపై వీరికి పూర్తి విశ్వాసం ఉంది.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్