ఫోకస్

ఖాళీలు భర్తీచేయకుంటే ఉద్యమాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 33 నెలలు కావస్తున్నా సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక దీనావస్థలో మగ్గుతున్నారు. ఇందుకోసం ఎబివిపి ఆధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమానికి పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో 25,125 పాఠశాలల్లో 16వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 130 డిగ్రీ కాలేజీల్లో 1300 అధ్యాపకుల పోస్టులు, 4400 జూనియర్ లెక్చరర్ల పోస్టులు, 15 విశ్వవిద్యాలయాల్లో 2210 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే లెక్కలు చెబుతోంది. గతంలో ఎబివిపి అనేక ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి నిరుద్యోగ గోస వినిపించినా, ప్రయోజనం లేకపోవడంతో తాజాగా నిరుద్యోగులను ఏక త్రాటిపైకి తీసుకువచ్చి పెద్దఎత్తున ఉద్యమాలు చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల ఖాళీలతో విద్యావ్యవస్థ భ్రస్టుపట్టింది. ‘సేవ్ ఎడ్యుకేషన్-సేవ్ తెలంగాణ’ పేరుతో నిరుద్యోగులను ఏకీకరణ చేస్తున్నాం, ఇందుకోసం అంతా సన్నద్ధం కావాలి, ప్రైవేటు స్కూళ్లలో 5 లక్షల మంది ఉపాధ్యాయ అధ్యాపకులు వెట్టి చాకిరీ చేస్తూ నోటిఫికేషన్లకోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిండు అసెంబ్లీలోనే లక్షా ఏడు వేల ఖాళీలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా దానిపై ఎందుకు మాట్లాడటం లేదు? మాటల గారడీతో మాయ మాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 10మంది వైస్ ఛాన్సలర్లను నియమించడానికి మూడేళ్ల సమయం పట్టింది. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో అర్థం కావడం లేదు. ఉస్మానియాలో 700 పోస్టులు, జెఎన్‌టియులో 200 ఖాళీలను భర్తీ చేయాల్సి వుంది. పాలమూరులో 200 పోస్టులకు 12 మందితో చదువు చెప్పిస్తున్నారు. అదెలా సాగుతుందో ముఖ్యమంత్రికే తెలియాలి. ఈ మధ్య గురుకుల ఉపాధ్యాయ నియామకాలపై సాధ్యం కాని విధంగా తప్పుడు ప్రకటన ఇచ్చి, కావాలనే నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఉద్యోగ ప్రకటన చేసి నిరుద్యోగ జీవితాలను కాపాడాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను సైతం అవినీతి కారణంగా గద్దె దించిన అనుభవాలను కెసిఆర్ గుర్తుంచుకోవాలి. రానున్న రోజుల్లో ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ రూపొందించాం. దాని ప్రకారం మార్చి 4న స్థానిక శాసనసభ్యులకు, ఫ్లోర్ లీడర్లకు వినతి పత్రాలు అందిస్తాం, మార్చి 6, 7 తేదీల్లో అన్ని యూనివర్శిటీల్లో సదస్సులు నిర్వహిస్తాం, మార్చి 10వ తేదీన అన్ని శాఖల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

- ఎల్. అయ్యప్ప ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి