ఫోకస్

జాగ్రత్తతో ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కన్నా, సాధారణ ఉన్నత విద్యను అభ్యసించే విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొనే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా విద్యా సంబంధ అంశాలు, ర్యాగింగ్, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, ప్రభుత్వ విధానాలపై యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు, బంద్‌లు చేస్తుండటం పరిపాటి. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వర్సిటీ విద్యార్థుల కన్నా, బయటి వారి ప్రమేయం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పారదర్శకత పాటించడం, విద్యా సంబంధం అంశాలు, విద్యాభ్యాసానికి అనుకూలమైన చక్కని వాతావరణాన్ని కల్పించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల్ని వర్సిటీ స్థాయిలోనే నివారించి ప్రశాంతతను నెలకొల్పవచ్చు. ప్రధానంగా హాస్టళ్లలో నాన్ బోర్డర్ల బెడద కూడా ఉంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడం అర్హులైన విద్యార్థులందరికీ సరైన వసతులు కల్పించవచ్చు. ఎస్‌కెయూలో తాము ఈ దిశగా ఎఫర్ట్స్ పెట్టి 400 మంది నాన్ బోర్డర్స్‌ను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించాం. హాస్టల్ విద్యార్థులకు ఐడి కార్డులిచ్చాం. గదులు కేటాయించాం. రూ.150 కోట్లతో హాస్టళ్లలో వసతులు మెరుగపర్చి, కార్పొరేట్ తరహాలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేశాం. గ్రాడ్యుయేట్లకు సైతం నైపుణ్యం పెంచుకునేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌కు చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగ సాధనపైనే దృష్టి సారిస్తారు. తద్వారా ఆందోళనలు, బంద్‌ల జోలికి వెళ్లరు. చదువులపైనే దృష్టి పెట్టేలా విద్యా వాతావరణాన్ని కల్పించాలి. ర్యాగింగ్, కుల, విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. మేము ఎస్‌సి, ఎస్‌టి సెల్, విద్యార్థినుల కోసం మరో సెల్ ఏర్పాటు చేసి ఓ ఎస్‌డిగా మాజీ రిజిస్ట్రార్‌ను నియమించి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఎలాంటి సమస్యనైనా విద్యార్థులు ఎదుర్కొంటుంటే, దానిని అధికారుల దృష్టికి తెచ్చినపుడు ఆ సమస్యను సావధానంగా వినడం ద్వారా అధికారులపై నమ్మకం కుదురుతుంది. ఈ క్రమంలో సమస్యలను సులభంగా పరిష్కరించడం, వర్సిటీల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఇబ్బంది పెట్టడం వంటివి జరగవు. బోధనా సిబ్బంది నియామకాల్లో కుంటుపడకుండా చూడాలి.

- కూడేరు రాజగోపాల్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం