ఫోకస్

పాక్ వైఖరి మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రమేయంతోనే జరిగింది. దీన్ని మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ దాడిలో మనవాళ్లు కొంతమంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత దేశంపై కాలు దువ్వుతునే ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ముంబై దాడులు జరిగాయి. ఆ దాడులు జరిపింది కూడా పాకిస్తానే అన్నది బాహ్య ప్రపంచానికి తెలిసిందే. కానీ ఆ దాడులకు, తమకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ కొట్టిపారేసింది. ఇదే కాదు. భారత దేశంలో జరిగిన ప్రతి దాడిలోనూ పాకిస్తాన్‌కు సంబంధం ఉన్నా, లేదనే చెప్పుకొచ్చింది. అయితే పఠాన్‌కోట్ ఘటన తరువాత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా మోదీకి ఫొన్ చేసి, దాడిని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఉగ్రవాదుల ఏరివేతకు సహకరిస్తామని కూడా చెప్పారు. ఉగ్రవాదులకు సహకరించేవారిని కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు. దీన్నిబట్టి చూస్తే పాక్ వైఖరిలో కాస్త మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదిఏమైనా ఉగ్రవాదులు భారత్‌లో చొరబడకుండా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవలసి ఉంది. భారత్-పాక్ మధ్య చర్చలకు పఠాన్‌కోట్ సంఘటన అవరోధంగా మారుతుందా అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేం. ఎందుకంటే విదేశీ వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సయోధ్యకు మోదీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తాయని ఆశిద్దాం.

- కంభంపాటి హరిబాబు విశాఖ ఎంపి