ఫోకస్

ఆధిపత్య ధోరణులవల్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్చను ఇచ్చింది. ఈ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడంవల్ల విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొంటోంది. ఢిల్లీలో ఒక కాలేజీలో ఒక యూనియన్ జెఎన్‌యుకు చెందిన విద్యార్థి నాయకులను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సంఘం వ్యతిరేకించింది. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థి దశలో ప్రతి అంశంపై విద్యార్థులను చర్చ చేయాలి. కాని ఆ చర్చ భారతదేశ సమగ్రతకు తూట్లు పొడిచే విధంగా ఉండరాదు. నిరుడు హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో కూడా రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడంపై దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొంది. ఈ వివాదంపై పార్లమెంటు కూడా స్తంభించింది. చివరకు పెద్దఎత్తున గంటల తరబడి చర్చ జరిగింది. విశ్వవిద్యాలయాల్లో అశాంతికి అనేక కారణాలున్నాయి. ఉన్నత చదువులకోసం వచ్చిన విద్యార్థులపై సమాజం, దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం ఉంటుంది. ఆ అంశాలపై విద్యార్థులు స్వేచ్చగా చర్చించేందుకు వాతావరణం ఉండాలి. అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు తమ ఆధిపత్యం చాటేందుకు ప్రజాస్వామబద్ధమైన వాతావరణాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నం చేయడం సబబు కాదు. ఏ యూనియన్‌కు చెందినవారైన వారు విద్యార్థులు. రెండు, మూడేళ్లు కాలేజీలో చదివి వివిధ పోటీ పరీక్షలు రాసి బతుకు తెరువుకోసం ఉద్యోగాలు వెతుక్కుని పోతారు. ఒక విద్యార్థి కొన్ని అంశాలపైన తన భావాలను వ్యక్తీకరించిన వెంటనే దేశ వ్యతిరేక ముద్ర వేయడం వాంచనీయం కాదు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం లాంటి అంశాలపై కూడా చర్చ జరగాలి. అంతేకాని ఆ సిద్ధాంతాలకు వంతపాడే బయటి శక్తులకు ఊతం ఇచ్చే విధంగా విద్యార్థులు ఉండరాదు. నిరుద్యోగం, సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యం, మతతత్వ శక్తుల ప్రాబల్యం, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పడిపోవడం, విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం, కుల, మతతత్వంతో డీన్‌లు, ప్రొఫెసర్లు వ్యవహరించడం, ఆర్థిక అసమానతలు కూడా విశ్వవిద్యాలయాల్లో అశాంతికి కారణమని భావిస్తున్నాను. వర్శిటీల్లో ప్రజాస్వామ్య పరిఢవిల్లాలంటే ప్రభుత్వం లేదా యూనియన్లు రాజకీయాలకు పాల్పడరాదు.

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్