ఫోకస్

సంక్షోభంలో పడేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో విశ్వవిద్యాలయాలను పాలకులు సంక్షోభంలో పడేశారు. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జాతీయత, దేశభక్తి అంటూనే స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. బనారస్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీలతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలను ఉద్దేశపూర్వకంగా సంక్షోభంలోకి నెట్టివేశారు. రెండు దశాబ్దాల నుండి తెలుగురాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడం లేదు. భారత్‌లోని విశ్వవిద్యాలయాలు పనికిరావన్న భావన తీసుకువస్తున్నారు. బిజెపి ప్రభుత్వం చెబుతున్న జాతీయత, దేశభక్తి ఇదేనా అన్న ప్రశ్న అందరిలో కలుగుతోంది. 1990 నుండి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అవకాశం ఇవ్వడం ప్రారంభమైంది. ఈ పరిస్థితిలో స్వదేశీ విశ్వవిద్యాలయాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉంది. భారతీయ భావజాలమే మన అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. భవిష్యత్తు తరాలకోసం మన విశ్వవిద్యాలయాలను ఉన్నతస్థితికి తీసుకువచ్చి, కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. సమాజంలోని అట్టడుగు వర్గాలవారు విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశం వచ్చింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులు, అట్టడుగు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య తలెత్తే విభిన్న భావాలే భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అందులో తప్పేమీలేదు. ఘర్షణకు గురైన విశ్వవిద్యాలయాలే విద్యారంగంలో, పరిశోధనా రంగాల్లో ఉన్నత ఫలితాలను సాధించాయి. సమాజంలో సమస్యలను పరిష్కరించేందుకు విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు చూపుతాయి. మంచి సమాజంకోసం పాటుపడతాయి. సమాజం ఎలా నడవాలో విశ్వవిద్యాలయాలు చెబుతాయి. సమాజంలో విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. కుల, మతాలకు అతీతంగా పేద-్ధనిక వర్గాలకు అతీతంగా అందరికీ విద్య అందుబాటులోకి రావాలి. అయితే 1990 దశకంలో వచ్చిన ఆర్థిక అభివృద్ధి నమూనాతో విశ్వవిద్యాలయాల్లో రాజ్యం (ప్రభుత్వం) ప్రమేయం ఎక్కువైంది. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వంలో భాగం కాదు. సమాజంలో ఒక భాగం. విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ ఖజానానుండి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు తాము స్వయంగా జేబుల్లోంచి నిధులు ఇస్తున్నట్టు భావిస్తూ, తాము చెప్పినట్టే, తమ ఆలోచనలకు అనుగుణంగానే విశ్వవిద్యాలయాలు నడవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులు అంటే ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బు ఖజానాకు చేరుతుంది. ప్రజల సొమ్ము, ప్రజలకోసమే వినియోగించడం ప్రజాస్వామ్య విధానంలో ఒక భాగం. వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎఎస్ అధికారి విఠల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విసిగా బాధ్యతలు తీసుకోవాలని సూచించగా, విఠల్ అందుకు తిరస్కరించారు. విద్యావేత్తలే విసిలుగా ఉండాలని స్పష్టం చేశారు. నేడు విశ్వవిద్యాలయాల్లో బ్యూరోక్రసీ (ఐఎఎస్‌లు) జోక్యం చేసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. విశ్వవిద్యాలయాలను సమాజం హితంకోసం ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.

- ప్రొఫెసర్ హరగోపాల్, సామాజిక శాస్తవ్రేత్త