ఫోకస్

అశాంతి మూలాలను ఏరిపారేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు విశ్వవిద్యాలయాలు విద్యా నిలయాలు. విద్య మీద ఆసక్తి కలిగిన విద్యార్థులతో కళకళలాడుతుండేవి. ఒకవేళ ఎప్పుడైనా, ఎవరైనా ఒకరిద్దరు విద్యార్థులు విద్యకు సంబంధం లేని అంశాల మీద అలజడి చేసే యత్నం చేస్తే ప్రొఫెసర్లు మందలించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రొఫెసర్లే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. అలజడి లేని, విద్యా ప్రాంగణాలను ఆశాంతి నిలయాలుగా ఎలా మార్చవచ్చో నేర్పుతున్నారు. విద్యార్హతలు కాక వారి వారి రాజకీయ భావజాలాన్ని అనుసరించి కొన్ని దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలలో ఉద్యోగాలు ఇచ్చిన విష సంస్కృతి వికృత రూపమే నేడు విశ్వవిద్యాలయాలలో ప్రజ్వరిల్లుతున్న అశాంతి, ఆందోళనలు. అందులో విద్యకు సంబంధించిన అంశాలు మచ్చుకు లేవు. విసిగా ఎవరుండాలో వారే నిర్ణయించాలంటారు. ఏ విసి మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చెయ్యాలో వారే చెబుతారు. తప్పుడు ఎస్సీ సర్ట్ఫికెట్‌తో విద్యాలయాలలో సీట్లు సంపాదించిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే భరించలేరు. అసహనం వారి నరనరాన జీర్ణించుకుంది. తమ భావవ్యక్తీకరణకు తప్పించి ఇతరుల భావ వ్యక్తీకరణ భరించలేని వర్గాలు విశ్వవిద్యాలయాలలో పాతుకుపోయాయి. అశాంతి మూలాలను విద్యాలయాల నుండి తొలగిస్తే తప్పించి భారతదేశ విశ్వవిద్యాలాలు గత వైభవం అందుకోవు.

- డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విశ్రాంత ప్రొఫెసర్, విజయవాడ