ఫోకస్

చైతన్యం కలిగించకుండానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు రహిత లావాదేవీలను మరింత పగడ్బందీగా అమలుచేయాలన్న ఉద్దేశంతోనే బ్యాంకులు, ఎటిఎంల లావాదేవీలపై పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. లక్ష్య సాధనకు చేపట్టిన ఉద్దేశం మంచిదే అయినా... మన దేశ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. మన దేశంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. నగదు రహిత లావాదేవీలు అంటే ఒక నిరక్ష్యరాస్యుడు తన కార్డును సక్రమంగా ఉపయోగించుకోలేడు. దాని వినియోగంలో తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా నిరక్షరాస్యుడు కావడంవల్ల మోసానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. చిన్నాచితకా వ్యాపారం చేసుకునేవారు, ముఖ్యంగా కూరగాయలు విక్రయించుకునేవారికి, పాల వ్యాపారికి కార్డు ఇచ్చి కూరగాయలు, పాలు ఇవ్వమంటే, సదరు చిన్న వ్యాపారులు తమ వెంట మిషన్ పెట్టుకుని తిరగగలరా? చిరు వ్యాపారులు, పైగా కొనుగోలు కూడా చిన్న మొత్తంలోనే ఉంటుంది.. ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో యాభై రూపాయలు ఖర్చు చేస్తే, సదరు యజమాని ఎటిఎమ్ కార్డు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే, కనీస బిల్లు రూ.200 ఉండాల్సిందేనని వాదిస్తాడు. ఇటువంటి వాటికి నగదు రహితం ఎలా సాధ్యం అవుతుంది? చెప్పేందుకు బాగానే ఉంటుంది కానీ ఆచరణలో అనేక కష్టాలు ఎదురవుతాయి. ఇక బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగదు రహిత లావాదేవీలు సాధ్యపడక చతికిలపడ్డాయి. అవినీతిని అంతమొందించాలనో, నగదు లావాదేవీలను అరికట్టాలనో ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది. నిజమే కానీ, బ్యాంకుల్లో లావాదేవీల విషయానికి వస్తే కొన్నిసార్లు కార్డు వాడిన తర్వాత పన్ను వేయడం దారుణం. నగదు రహిత లావాదేవీల విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయకుండా బ్యాంకుల లావాదేవీలపై పన్ను విధించడం భావ్యం కాదు. నిరక్షరాస్యత, స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పన్ను విధానానికి స్వస్తి పలకాలి.

- సి. రామచంద్రయ్య ప్రతిపక్ష నేత, ఎపి శాసనమండలి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు