ఫోకస్

సామాన్యుడిపై మరోభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నుంచి సామాన్య ప్రజలు తేరుకునేలోపు సామాన్య ప్రజలపై బ్యాంకు చార్జీల పేరుతో మరో భారం మోపడం సరైన పద్ధతి కాదు. సామాన్యులు కూడా బ్యాంకింగ్‌కు అలవాటు పడాలంటే కొనే్నళ్లపాటు బ్యాంకింగ్ చార్జీలు తగ్గించాలి. అదనపు రుసుములు, సర్వీస్ చార్జీల పేరుతో బ్యాంకులు సామాన్యుల నడ్డిని విరగ్గొట్టరాదు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు, బ్యాంకింగ్ పోకడకు మధ్య పొంతన ఉన్నట్టు కన్పించడం లేదు. భారత సగటు ఆదాయం, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకుల మనుగడకోసం చార్జీలను పెంచుతామనడం సరికాదు. ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలంటున్నారు. కరెంట్ బిల్లు చెల్లించినా, ట్రైన్ టిక్కెట్ తీసినా ప్రతి దానికి డెబిట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం పేరుతో జిఎస్‌టి ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం అమలు చేయడంవల్ల ప్రజలపై మరింత పన్నుభారం పడనుంది. ప్రజలను బ్యాంకింగ్ రంగం వైపునకు అలవాటుపడేలా చేయాలంటే వారిని విద్యావంతులను చేయాలి. చార్జీలు పెంచడంవల్ల ప్రజలు బ్యాంకింగ్ రంగానికి దూరమయ్యే పరిస్థితి తలెత్తుంది. ఎటిఎంలలో డబ్బులు లేకపోయినా కోట్లాది విలువైన 2వేల కొత్తనోట్లతో పలువురు పట్టుబడ్డారు. ఇదెలా సాధ్యమైంది? దీనిని పరిశీలిస్తే ప్రభుత్వం, బ్యాంకింగ్ రెండు వేర్వేరు దిశలలో ప్రయాణిస్తున్నారని అర్థమవుతోంది. పెద్దనోట్ల రద్దు అని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే ఎటిఎంలలో క్యాష్ నింపకుండా బ్యాక్‌డోర్ నుంచి వారు వాటిని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించాలనుకుంటే .. ఖాతాదారులు బ్యాంకుల వద్దకు వెళ్తే ఏమవుతుందోనని రీతిలో బ్యాంకింగ్ నిర్ణయాలు ఉంటున్నాయి. ఇలాగైతే ప్రధాని మోదీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఎలా రాబట్టగలరు? సామాన్య ప్రజానీకం మీద బ్యాంకింగ్ చార్జీలు రుద్దకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

-కాపుగంటి ప్రకాష్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, విజయనగరం