ఫోకస్

ఉగ్రవాదం ప్రపంచానికే ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ఒక సమస్యగా పరిణమిస్తోంది. ఉగ్రవాదం ఎప్పటికైనా ముప్పే. ప్రపంచ దేశాలు సహితం ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉగ్రవాద సమస్య యావత్ ప్రపంచానికే సవాలుగా మారింది. దీన్ని వీలైనంత త్వరగా అణచివేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. దేశాలు అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. పాక్-్భరత్ సరిహద్దుల్లో ఏదో ఒకచోట ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రపంచంలోని ఏ దేశమైనా తీవ్రవాదాన్ని ప్రేరేపించొద్దు.. పోషించొద్దు.. అప్పుడే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఏ దేశం కూడా ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వొద్దు, వారిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. తీవ్రవాదులను ప్రేరేపించే ఏ దేశమైనా శత్రు దేశంగా పరిగణించక తప్పదు. అఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, ఇరాన్ వంటి దేశాల్లో కొనసాగుతున్న విధ్వంసకాండ మనం చూస్తున్నాం. ఉగ్ర, తీవ్రవాద భావజాలం వైపు మళ్లే యువకులకు కౌనె్సలింగ్ నిర్వహించాలి. ఈ మధ్య భారత్‌లో ఉగ్రవాద భావజాలం పెరుగుతోంది. అందుకు తగిన విధంగానే మన పోలీసులు, సైన్యం వ్యవహరిస్తోంది. భారత్ ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంది. ప్రపంచ దేశాల్లో భారత్‌కు మంచి ఆదరణ ఉంది. ప్రపంచ పటంలో గుర్తింపు పొందిన దేశంగా భారత్ వెలిగిపోతుంది. అలాంటి మన దేశంలో తీవ్రవాదం ఒక చీడ పురుగులా పాకుతుంది. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని తుద ముట్టించాలి. ఉగ్రవాదులను, తీవ్రవాదులను ఎదుర్కొనడంలో భారత్ వెనుకాడబోదు. భారత్‌కు అన్ని హంగులు ఉన్నాయి. ప్రపంచంలోని దేశాలన్నీ ఏకమైతే ఉగ్రవాదాన్ని తుద ముట్టించగలవు. ప్రతి భారతీయుడు దేశం కోసం, దేశాభివృద్ధి కోసం అంకితభావం కలిగివుండాలి. తీవ్రవాదాన్ని దరిదాపులకు రానివ్వొద్దు, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

-అనురాగ్ శర్మ, తెలంగాణ డిజిపి