ఫోకస్

ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ 1 నుంచి లావాదేవీలపై భారీగా చార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించడం సరైంది కాదు. నగదు డిపాజిట్లు, ఏటిఎంలలో నగదు ఉపసంహరణపై పరిమితులు పెట్టి చార్జీలు విధించడం దారుణం. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది. చార్జీల వసూళ్లతో బ్యాంకులు ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అక్రమ లావాదేవీలు పెరిగి అసాంఘిక శక్తులు పేట్రేగే అవకాశం ఉంది. నగదు రహిత లావాదేవీలు జరపాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుంది. వ్యాపారస్తులు తమ లావాదేవీలు తగ్గిస్తే వాణిజ్యం దెబ్బతిని ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడి తగ్గి ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారవుతుంది. ఇతర బ్యాంకుల ఏటిఏంల నుంచి ఉపసంహరణ మూడుసార్లు దాటితే రూ.20 చార్జీ, ఎస్‌బిఐ ఏటిఎంలలో నగదు ఉపసంహరణ ఐదుసార్లు దాటితే రూ.10 చొప్పున చార్జీ వసూలుచేయడం అమానుషమే. నాలుగో డిపాజిట్ నుంచి సేవా పన్నుతోపాటు రూ.50 చార్జి వసూలు చేస్తే బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయి బ్యాంకుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. కనీస నగదు నిల్వ (రూ.5000) కంటే 75 శాతం కన్నా తక్కువ ఉంటే సేవా పన్నుతో పాటు రూ.100 జరిమానా, కనీస నగదు నిల్వ కన్నా ఖాతాలో 50 శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్ చార్జీతో కలిపి రూ.50 జరిమానా వసూలు చేయడం సమంజసం కాదు. కరెంటు ఖాతాలో కనీసం రూ.20000 ఉండాలనే నిబంధనతో వ్యాపారులు బ్యాంకులకూ దూరమవడం జరుగుతుంది.

- వక్కలగడ్డ భాస్కరరావు, అధ్యక్షుడు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ