ఫోకస్

వినియోగదారుడికే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకులు చార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం.. ఈ చార్జీలు వర్తకులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలతో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ఇపుడు చార్జీల మోతవల్ల మధ్యతరగతివారు వ్యాపారాన్ని సాగించలేని దుస్థితి నెలకొంది. ఇటువంటి చార్జీల భారం కాస్తా చివరికి వినియోగదారుడిపైనే పడే పరిస్థితి దాపురిస్తోంది. నియంత్రణ లేని ఈ చార్జీలను పెంచడం ఖాతాదారులకు పెనుభారం. బ్యాంకు అంటేనే భయపడిపోయే పరిస్థితులను సృష్టిస్తున్నారు. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత మొదటిసారిగా భారీస్థాయిలో చార్జీల భారాన్ని మోయాల్సివస్తోంది. ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా చార్జీలను విధిస్తున్నాయి. రూ.50 నుంచి రూ.150 వరకు ఒక్కో లావాదేవీకి చార్జీ వసూలు చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం మరోటివుండదు. ఒక రకంగా ఇది దోపిడీ. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సివుంది. తక్షణం బ్యాంకు చార్జీలను ఉపసంహరించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వంపై తీవ్రవ్యతిరేకత తప్పదు. వ్యాపారులకు నిత్యం బ్యాంకులతో పని వుంటుంది.. కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తూవుంటాం. రోజుకు ఐదారుసార్లయినా లావాదేవీలువుంటాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా చార్జీలను అమలుచేస్తోంది. లావాదేవీ చేసినపుడల్లా రూ.50 నుంచి రూ.150 వరకు చార్జీ అంటే ఇంక వ్యాపారాలు సాగినట్టే. ప్రభుత్వం స్వైపింగ్ మిషన్లు పెంచి కార్పొరేట్ వ్యాపారాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టే.. చిన్న వ్యాపారులను మరో మార్గంలో దెబ్బకొట్టేందుకే ఇటువంటి ప్రయత్నాలు అన్నట్టుగా వుంది. ఈ చార్జీలు ఎంత మాత్రం హేతుబద్ధం కాదు. తక్షణం ఉపసంహరించుకోవాలి. ఈ చార్జీలవల్ల మధ్యతరగతి వ్యాపారాలు కుదేలయ్యే పరిస్థితి ఎదురవుతోంది. బ్యాంకులపై ప్రభుత్వానికి నియంత్రణ వుండాలి. మా డబ్బు బ్యాంకులో ఉన్నప్పటికీ ఎటిఎంల నుంచి తీసుకోలేని స్థితి వుందంటే ఇంతకంటే దారుణం మరోటి వుండదు. ఇటువంటి పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. మా డబ్బు బ్యాంకులో ఉన్నందుకే ఇటువంటి బాదుడు పెడుతుంటే.. బ్యాంకు మెట్లెక్కుతేనే చార్జెస్ పడే పరిస్థితి దాపురించింది. నెలకు మూడు లావాదేవీలు దాటితే రూ.50 నుంచి రూ.150 చొప్పున చార్జీలు వసూలు చేయడమంటే ఇక వ్యాపారాలు సాగించలేం. ఈ చార్జీలు చివరిగా వినియోగదారుడికే భారంగా పరిణమిస్తాయ.

-బూరగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్, రాజమహేంద్రవరం.