ఫోకస్

ప్రాథమిక హక్కు హరించటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకు లావాదేవీలపై పరిమితులు విధించటం ప్రజల ప్రాథమిక హక్కులను హరించటమే. ఖాతాదారులకు సేవలు అందించటంవల్ల నష్టాలు వస్తున్నాయని బ్యాంకులు వాదించటం సబబుకాదు. ఒకపక్క కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెట్ పరచి వేలకోట్లు రూపాయలు రుణాలు ఇవ్వటం, అవికాస్తా తిరిగి చెల్లింపులు జరుగక బ్యాంకులు దివాళా తీయటం అందరూ గమనిస్తునే ఉన్నారు. కానీ సామాన్య, మధ్యతరగతికి చెందిన ఖాతాదారుల విషయానికి వచ్చేసరికి నష్టాల పేరిట రుసుములు విధించటం, పరిమితులు విధించటం సరికాదు. పెద్దనోట్ల రద్దు కారణంగా ఇప్పటికీ సామాన్య ప్రజలు కోలుకోని పరిస్థితి ఏర్పడింది. ప్రారంభం నుంచి నగదు ఉపసంహరణపై నిబంధనలు విధించిన రిజర్వ్ బ్యాంకు ఇప్పుడు బ్యాంకులు నగదు ఉపసంహరణపై, ఖాతాదారులకు ఇచ్చే సేవలపై పరిమితులు విధించటం, పన్ను విధించటం వౌనంగా ఉండటం, ఈ అంశం తమ పరిధిలోకి రాదనే విధంగా వ్యవహరించటం శోచనీయం. నోట్ల రద్దు ద్వారా ప్రజల వద్ద డబ్బులు లేకుండా చేసిన కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఇప్పుడు అదే ప్రజలు తమ డబ్బులకోసం బ్యాంకులకు వెడితే కొత్త కొత్త నిబంధనలు అమలు చేయటంవల్ల బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోతుంది. తాజా నిబంధనల కారణంగా ప్రజలు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసుకోవటం శుద్ధ దండగ అనే అభిప్రాయానికి వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ప్రణాళికలకు, ఆర్థిక వ్యవస్థకు ముప్పువాటిలే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ద్వారా లావాదేవీలు జరుపుకునే పరిజ్ఞానంపై దేశంలోని ఎంతమంది జనాలకు అవగాహన ఉంది, ఈ పరిజ్ఞానం ఎంతమేరకు అందుబాటులో ఉందనేది ప్రభుత్వాలు, బ్యాంకర్లు గమనించాలి. ఏటిఎంల ద్వారా మొదట పరిమిత సంఖ్యలో డబ్బు డ్రా చేసుకోవచ్చనే షరతుతో ప్రారంభించి, ఇప్పుడు షరతులు ఎత్తివేసినట్లు బ్యాంకులు ప్రకటిస్తున్నా ఎన్ని బ్యాంకులలో ఏటిఎంలు పనిచేస్తున్నాయి, ఎంతమేరకు డబ్బు ఏటిఎంలలో అందుబాటులో ఉంది బ్యాంకర్లు బేరీజు వేసుకోవాలి. ఏటిఎంలలో డబ్బు అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ప్రజల ఇబ్బందులను గమనించి ఏటిఎంలద్వారా, బ్యాంకులద్వారా నగదు డ్రా చేసుకునేందుకు విధించిన పరిమితులను, రుసుములను బ్యాంకులు ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వాలు కూడా బ్యాంకర్లకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇచ్చి బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.

- త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ చార్ట్టర్డ్ అకౌంటెంట్