ఫోకస్

సేవాభావం లోపించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకుల వల్ల సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు ఇతర వర్గాలకు చెందిన పేదలకు లబ్ధి జరగాల్సి ఉంది. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో వచ్చిన వాణిజ్యపరమైన ఆలోచనలతో వినియోగదారులపై పెనుభారం పడుతోంది. సేవ (సర్వీస్) పేరుతో వినియోగదారులపై బ్యాంకర్లు చార్జీల భారం మోపుతున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ, నాబార్డ్, ఇతర బ్యాంకులు పునరాలోచన చేయాలి. బ్యాంకులు కేవలం సేవకోసమే వచ్చినవి కాకపోయినప్పటికీ, అవి వడ్డించే చార్జీలు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ప్రజలకు ఆర్థికపరమైన సేవలు అందించేందుకు 1956లో ఎస్‌బిఐని స్థాపించారు. ఆ తర్వాత వివిధ వాణిజ్య బ్యాంకులు వచ్చాయి. వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు విస్తృతంగా రుణాలు ఇవ్వాలని అప్పట్లో భావించారు. ఎస్‌బిఐతోపాటు ఇతర వాణిజ్య బ్యాంకులవల్ల అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత సహకార బ్యాంకులు రంగంలోకి వచ్చాయి. అవికూడా గ్రామీణులకు సేవలు అందించడంలో విఫలం అయ్యాయి. బ్యాంకులను ప్రజలకు చేరువ చేసేందుకు 1968లో బ్యాంకింగ్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. ఆ తర్వాత మరికొన్ని వాణిజ్య బాంకులు కూడా జాతీయం అయ్యాయి. అయినప్పటికీ వాణిజ్య బ్యాంకులు గ్రామీణులకు సేవలు అందించడంలో విఫలం అయ్యాయి. దాంతో 1976లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలో లీడ్ బ్యాంక్‌గా ఉండే వాణిజ్య బ్యాంకు తమ పరిధిలో జిల్లా స్థాయిలో గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేశాయి. గ్రామీణ బ్యాంకులు నష్టానికి గురైనా, గ్రామాలకు చేరాయి. 1990 వరకు బాగానే నడిచింది. ఆ తర్వాత మళ్లీ బ్యాంకులు వాణిజ్యపరమైన లావాదేవీలవైపుకన్ను పెట్టాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గ్రామీణ ప్రజలకు ఇవి దూరమయ్యాయి. బ్యాంకులకు డిపాజిట్ల సేకరణకు టార్గెట్లు నిర్ణయించడం, రుణాలు ఇచ్చేందుకు టార్గెట్లు నిర్ణయించడంతో సిబ్బంది ధృక్పథంలో మార్పు వచ్చింది. రుణాలు పెద్దవాళ్లకు సులభంగా లభిస్తుండగా, పేదలకు రుణాలు ఇవ్వడంలో సవాలక్ష ఆంక్షలు పెడుతున్నాయి. గ్రామీణ, వాణిజ్య, సహకార బ్యాంకులన్నీ లాభాలు, వాణిజ్య కోణంలో పనిచేయడం ప్రారంభించాయి. పేదవారికి రుణాలు ఇస్తే తిరిగిరావన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఇది దుర్మార్గమైన చర్యగా భావించవచ్చు. ఈ పరిస్థితిలో వ్యాపారపరంగా, లాభాల పరంగా బ్యాంకులు పనిచేయాలన్న ధృక్పథంలో మార్పు రావాలి. అవసరమైన, అర్హులైన పేదలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకులు సహకరించాలి. సామాన్యులపై చార్జీల పేరుతో భారం మోపకూడదు.

- పిఎస్‌ఎం రావు, ఆర్థిక నిపుణుడు