ఫోకస్

బ్యాంకులే నష్టపోతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రజానీకం ఇప్పుడిప్పుడే డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకుంటున్న తరుణంలో అందుకు తనవంతు సహకారం అందించాల్సిన బ్యాంకులు, నగదు లావాదేవీలపై చార్జీలు వసూలు చేయాలని భావించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. దీనివలన బ్యాంకులే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. 31కోట్ల మంది ఖాతాదారులతో దేశంలోనే అతి పెద్ద బ్యాంక్‌గా ఉన్న ఎస్‌బిఐ ఏప్రిల్ 1వ తేదీనుండి బ్యాంక్ లావాదేవీలపై పరిమితులు విధించాలనుకోవడం ఆందోళనకర విషయం. ఈ పద్ధతినే ఇతర బ్యాంకులు అనుసరిస్తే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. బ్యాంకుల్లో నగదు దాచుకునే అలవాటు ఉండే వారంతా రుసుములకు భయపడి ఇళ్లలోనే నిల్వ ఉంచుకుంటారు. ఉద్యోగులు, పింఛన్‌దారుల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కేవలం నెలకు మూడు లావాదేవీలు మాత్రమే ఉచితంగా అనుమతిస్తామని ఎస్‌బిఐ ప్రకటించడం సమంజసంగా లేదు. ఈ విధంగా చార్జీలు వసూలు చేసే పద్ధతి గతంలోనూ ఉన్నప్పటికి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి భారీగా చార్జీలు పెంచాలనుకోవడం సరికాదు. దీంతో తమకు అవసరమైన సమయంలో మాత్రమే నగదు తీసుకునే అలవాటు ఉండే ఎందరో సామాన్యులు ఈ లావాదేవి చార్జీలకు భయపడి ఒకేసారి నగదు మొత్తం విత్‌డ్రా చేసుకొని ఇంట్లోనే ఉంచుకునే అవకాశం లేకపోలేదు. చార్జీలు తక్కువగా వసూలు చేసే బ్యాంకుల వైపు ఖాతాదారులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు బలపడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పలు పన్నుల రూపంలో సంపాదనలో సగభాగం వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇంకా ఇలాంటి చార్జీలు విధించడం ఎంతమాత్రం సబబుగా లేదు. రాబోయే రోజుల్లో ఆదాయపన్ను శాఖను తొలగించి కేవలం బ్యాంక్ లావాదేవీల ఆధారంగా పన్నులు విధించాలనే ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి ఈ చార్జీల విధింపు అడ్డుతగిలే అవకాశం ఉంది. సాధారణ ప్రజలతోపాటు కరెంట్ ఖాతాలు నిర్వహించే వ్యాపార వర్గాలవారు సైతం బ్యాంకుల వైపు చూసేందుకు జంకుతారు. సేవింగ్స్ ఖాతాదారులకు నామమాత్రపు వడ్డీ మాత్రమే బ్యాంకులు ఇస్తున్నప్పటికి బ్యాంక్‌లో నగదు ఉంచుకోవడానికి ఇప్పటిదాకా ప్రాధాన్యతనిస్తూ వచ్చిన మధ్యతరగతి ప్రజలు బ్యాంకులకు దూరమవుతారు. బ్యాంకుల తీరును చూస్తుంటే.. ఇదివరకట్లా ఇంట్లోనే నగదు దాచుకునే రోజులు తిరిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ రుసుములు ఇలానే కొనసాగితే దేశంలో బ్యాంకింగ్ రంగానికి కచ్చితంగా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. జిఎస్‌టి అమలుచేసే విషయంలో ఎన్నోసార్లు సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. అటువంటిది ఎంతో ముఖ్యమైన ఈ విషయంలో బ్యాంకింగ్ రంగాలకు ముందస్తుగా ఆర్థికరంగ నిపుణులతో ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండా మొండిగా చార్జీల వసూలు చేయాలని నిర్ణయిస్తే చివరకు నష్టపోయేది బ్యాంకులు మాత్రమే. బ్యాంక్ లావాదేవీల చార్జీల వలన డిజిటల్ లావాదేవీలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఆందోళనకరమే.

- వొమ్మిన సతీష్‌బాబు ఏపి చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మాజీ డైరక్టర్