ఫోకస్

అనాలోచిత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ ఎకానమి కోరుకుంటున్న ప్రభుత్వం అందుకు అనువైన వాతావరణం కల్పించకుండా, ప్రజన నెత్తిన భారం రుద్దాలనే ప్రయత్నం చేస్తోంది. బ్యాంకుల్లో నగదు లావాదేవీలకు సంబంధించి ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రజల్లో అభద్రత భావాన్ని పెంచుతోంది. ఈ విధమైన నిర్ణయాలతో ప్రజలు తమ సొమ్ము బ్యాంకుల్లో కంటే ఇంట్లో ఉంటేనే మేలనుకునే పరిస్థితులకు దారితీస్తోంది. తద్వారా ప్రభుత్వం కోరుకుంటున్న డిజిటల్ లావాదేవీలకు ప్రతికూల పరిస్థితులను కల్పిస్తుందనడంలో సందేహం లేదు. విదేశాల్లో పరిస్థితులకు, మనదేశ గ్రామీణ వ్యవస్థకు ఎంతో వ్యత్యాసం ఉంది. సగానికి పైగా మన ప్రజానీకం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. పాలు, నిత్యావసరాలు, ఇతర అవసరాలకు అత్యధిక శాతం ప్రజానీకం నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనికి కారణం అక్కడ నగదు రహిత లావాదేవీలకు అవకాశాలు చాలాస్వల్పం. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఎకానమీకి అనువైన వాతావరణం లేదు. ముందుగా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. వారు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలి. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు జరిపే విధంగా చిన్న వాణిజ్య సంస్థలకు అనువైన వాతావరణం కల్పించాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే డిజిటల్ ఎకానమీకి సంబంధించి ఇటు ప్రజల్లోను, అటు వ్యాపారస్తుల్లోను చోటుచేసుకున్న భయాలను పోగొట్టాలి. ఇదే సందర్భంలో సాంకేతికంగా డిజిటల్ ఎకానమీకి అనువుగా సదుపాయాలు సమకూర్చాలి. ఇక బ్యాంకుల్లో నగదు ఉపసంహరణ, నగదు జమలకు సంబంధించి తాజాగా తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయి. బ్యాంకు సేవలకు భారీచార్జీలు, సేవా పన్నులు విధించడంద్వారా ఖాతాదారుల అభిమానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా నగదు లావాదేవీలకే ప్రజలు మొగ్గుచూపే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు లాభాల్లోనే నడుస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఛార్జీల పేరిట ఖాతాదారుని ఇబ్బందులకు గురిచేయడం, సముచితం కాదు. ఈ తరహా నిర్ణయాల వల్ల భవిష్యత్‌లో అనుకోని ఇబ్బందులు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. తమ సొమ్ము బ్యాంకుల్లోనే ఉంటే భద్రంగా ఉంటుందనుకున్న ప్రజానీకం తాజా నిర్ణయాలతో బ్యాంకుల కంటే ఇల్లే నయం అనుకునే పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, బ్యాంకు యాజమాన్యాలు కానీ బ్యాంకుల్లో నగదు జమ, ఉపసంహరణలపై మోపాలనుకుంటున్న సేవా రుసుముల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే మంచిది.

- ఎవి మునీష్ రావ్ అధ్యక్షుడు, వైజాగ్ పట్నం చాంబర్ ఆఫ్ కామర్స్