ఫోకస్

పెనుభారంగా బ్యాంకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో నగదు రహిత సమాజాన్ని నెలకోల్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సామాన్యులపై పెనుభారాన్ని మోపుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు, తర్వాత కొత్త రెండు వేల రూపాయిల నోట్లు మార్కెట్‌లోకి రావడంతో కొద్దిగా కోలుకున్నా, రెండో దశ ఆర్థిక సంస్కరణలు అమలులోకి తెచ్చే ప్రయత్నంలో ఆర్‌బిఐ మార్గదర్శకాలను అనుసరించి బ్యాంకులు బాదుడు మొదలుపెట్టాయి. నగదు లావాదేవీలపై ఇకనుండి రుసుం వసూలు చేయనున్నట్టు రోజుకో బ్యాంకు ప్రకటిస్తోంది. ఇంత వరకూ నెలకు నాలుగు ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకులు నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు నెలకు నాలుగు సార్లకు మించితే ఒక్కో లావాదేవీపై 150 రూపాయిలు వసూలు చేయనున్నట్టు ప్రకటించాయి. సేవింగ్స్‌తోపాటు నెల జీతాల ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆ బ్యాంకులు పేర్కొన్నాయి. ఎటిఎంలలో మాత్రం పరిస్థితి యథాతథంగా కొనసాగుతుందని తెలిపాయి. హెచ్‌డిఎఫ్‌సి థర్టు పార్టీ లావాదేవీలు రోజుకు 25వేలకు మాత్రమే పరిమితం చేస్తారు. ఐసిఐసిఐలో హోం బ్రాంచిలో ఒక నెలలో తొలి నాలుగు లావాదేవీలపై ఎలాంటి రుసుం ఉండదు. థర్టు పార్టీ నగదు లావాదేవీలు రోజుకు 50వేలకు మాత్రమే పరిమితం చేస్తారు. యాక్సిస్ బ్యాంకులో తొలి ఐదు లావాదేవీలు లేదా 10 లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణకు ఎలాంటి రుసుం ఉండదు. పరిమితి దాటితే 150 రూపాయలు లేదా వెయ్యికి ఐదు రూపాయలు ఏది ఎక్కువైతే అది రుసుంగా వసూలు చేస్తారు.
బ్యాంకు ఖాతాదారుల నుండి భారీగా చార్జీలను వసూలు చేయాలని ఇప్పటికే ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు నిర్ణయించగా, ఇపుడు ప్రభుత్వ రంగ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు కూడా ఈ జాబితాలో చేరింది. పొదుపు ఖాతాల్లో కనీస మొత్తాలను ఉంచడంలో విఫలమైన వినియోగదారులపై ఏప్రిల్ ఒకటో తేదీ నుండి చార్జీలను విధిస్తారు.
మెట్రోపాలిటన్ నగరాల్లోని శాఖల్లో పొదుపు ఖాతాలు నిర్వహిస్తున్న వినియోగదారులు తమ ఖాతాల్లో కనీసం ఐదు వేల రూపాయలు మొదలు 10వేల వరకూ నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నగదు నిల్వను ఉంచని ఖాతాదారులపై సర్వీసు టాక్స్‌తోపాటు వంద రూపాయిలు అపరాధం విధిస్తారు. ఎగవేతలను వౌనంగా భరిస్తున్న బ్యాంకులు సామాన్యులపై మాత్రం సవాలక్ష ఆంక్షలతో పాతరేస్తున్నాయి. చార్జీల పేరిట చావగొట్టాలని చూస్తున్నాయనేది సుస్పష్టం. ఎటిఎంలు సంపూర్ణంగా పనిచేయడం లేదు. బ్యాంకుకుపోతే ఛార్జీలు అంటున్నారు. దీంతో సామాన్యులు సతమతమైపోతున్నారు. రానున్న రోజుల్లో బ్యాంకులు ఇంకెన్ని కొత్త ఆంక్షలు విధిస్తాయోననే భయానికి గురవుతున్నారు. బ్యాంకుల బాదుడుపై కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.