ఫోకస్

28న ఉగాది.. అదే శాస్ర్తియత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దృక్సిద్ధ పంచాంగం ప్రకారం 2017 మార్చి 28న అమావాస్యనాడు పాడ్యమి ‘ఏష్య’మయింది. ఏష్యా అంటే ముందురోజు సూర్యోదయానికి తిథి ఉండదు. తర్వాతిరోజు సూర్యోదయానికి తిథి ఉండదు. రెండు సూర్యోదయాలను స్పృశించని తిథిని ‘ఏష్య’ అంటారు. పూర్వపద్ధతి పంచాంగం ప్రకారం 2017 మార్చి 29న సూర్యోదయం అనంతరం ఉదయం ఏడుగంటల వరకు పాడ్యమి ఉంది. ఈ కారణంగా గణిత గణనంలో వచ్చిన భేదం కారణంగా దృక్సిద్ధాంతం ప్రకారం మార్చి 28న ఉగాది వస్తుంది. పూర్వ పద్ధతి పంచాంగం ప్రకారం మార్చి 29న ఉగాది వస్తుంది. ఈ కారణంగానే మార్చి 28న పండగ చేసుకోవాలా? 29న పండగ చేసుకోవాలా? అన్నది మీమాంసగా మారింది. పంచాంగకర్తలు వారి వారి పారంపరిక సంప్రదాయాలను బట్టి కొందరు దృక్సిద్ధ సిద్ధాంతాన్ని మరికొందరు పూర్వవిధానాన్ని అనుసరించి పంచాంగ గణన చేస్తున్నారు. దృక్సిద్ధాంతం అంటే కంటికి ప్రత్యక్షమయ్యే పద్ధతి. ప్రస్తుత కాలానికి అనుగుణమైన గణన విధానం. పూర్వపద్ధతి అంటే కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న పద్ధతి. ఈ కాలానికి అనుగుణమైన పద్ధతి కాదు అని ఆయా పేర్లను బట్టి తెలుస్తోంది. పంచాంగం చేసే సమయంలో గ్రహస్థితి, గతులు, దృక్సిద్ధికి సరిపోవాలంటే కొన్ని సంస్కారాలు తప్పకుండా చేయాలని సూర్య సిద్ధాంతాది గ్రంథముల్లో స్పష్టంగా చెప్పబడినది. యుగముల మార్పుచేత, కాలభేదముచేత కొన్ని బీజ సంస్కరాలు చేయాలి. దృక్తుల్యత పొందేంతవరకు అవసరమైన సంస్కారాలు చేయాలనేది సిద్ధాంత గ్రంథములన్నీ ముక్తకంఠంతో చెబుతున్నవి. కాలానుగుణమైన సంస్కారాలు చేసి రవ్యాదులను దృక్సిద్ధికి తీసుకురావాలి. కాలానుగుణమైన బీజ సంస్కారాలు చేసిన పంచాంగమే దృక్పద్ధతి పంచాంగం. దృక్పద్ధతి పంచాంగం ప్రకారమే పండగలు, వ్రతాలు, పితృతిథులను ఆచరించాలి. ఈ కారణంగానే హేవళంబి ఉగాది పండగను 2017 మార్చి 28న ఆచరించాలి. రవిచంద్రుల మధ్య దూరమే తిథి. రవిచంద్రులిద్దరినీ ఒకేసారి చూడటం నెలలో కొన్ని రోజుల్లోనే సాధ్యమవుతుంది. రవిచంద్రుల మధ్య దూరం డిగ్రీలలో ఉంటుంది. పంచాంగకర్తలు రవిచంద్రులను డిగ్రీలలో ఇవ్వాల్సి ఉంటుంది. అబ్జర్వేటరీల్లో తిథ్యాదులను వేధ చేస్తూనే ఉంటారు. వారు చేసే వేధ దృక్సిద్ధ పంచాంగానికి సరిపోతోంది. నక్షత్రశాలలు చేసే వేధచేత కూడా 28నే ఉగాది అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ తత్కాల రవిచంద్రులు, గ్రహముల స్థితి డిగ్రీలలో సాధించేందుకు దృక్సిద్ధ విధానానే్న అనుసరిస్తున్నాయి. నాసా తదితర సంస్థలు దృక్సిద్ధ విధానానే్న అనుసరిస్తున్నాయి. శాస్తవ్రేత్తలు దృక్సిద్ధ విధానాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని పరిశీలించినా 28 మార్చి 2017న ఉగాది జరుపుకోవాల్సి ఉంటుంది.

- కౌత లలితా మనోహర్, వేదశాస్తవ్రేత్త