ఫోకస్

బ్రాహ్మణ పరిషత్‌దే ప్రామాణికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిష్యంపై ఇటీవల కాలంలో ప్రజలకు నమ్మకం పెరిగిపోయింది. దీంతో కొందరు తమ వ్యక్తిగత ప్రచారంకోసం పండుగలను వివాదాస్పదం చేస్తున్నారు. పండుగలను ఆయా తిథి నక్షత్రాల ప్రకారం ఖరారు చేస్తారు. పంచాంగకర్తలు చాలామటుకు అనాదిగా పూర్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. మరికొందరు సూర్య సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. పూర్వ సిద్ధాంతం, సూర్యసిద్ధాంతం ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాల వల్ల తిథి, నక్షత్రాలలో తేడాలు వస్తున్నాయి. దీని వల్ల ఒక్కో పంచాంగంలో ఒక్కొరకంగా పండుగ తేదీలను ప్రకటిస్తుండటంతో ప్రజలను ఆయోమయానికి గురవుతున్నారు. సూర్యుడు ఉదయించే వరకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాది జరుపుకోవాలని కొందరు సిద్ధాంతుల వాదన. దీంతో ఉగాది 28న జరుపుకోవాలా లేక 29న జరుపుకోవాలా? అన్న వివాదం తలెత్తింది. ఒకే రాష్ట్రంలో ఒకటే రోజు ఉగాది జరుపుకోవాలని పండితులు, పంచాంగకర్తలు భావించి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కెవి రమణాచారితో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు.

- గంగు ఉపేంద్ర శర్మ అధ్యక్షుడు, తెలంగాణ అర్చక సమాఖ్య