ఫోకస్

29న ఉగాదే సముచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగలను ఒక్కో పంచాంగంలో ఒకరకంగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఇందులో వ్యత్యాసాలు రావడానికి ప్రధానంగా తిథి, నక్షత్రాదులలో తేడాలు రావడం కారణం. కొన్ని పండుగలు తిథి ప్రాధాన్యతను కలిగి ఉంటే మరికొన్ని పండుగలు నక్షత్ర ప్రాధాన్యత కలిగి ఉంటాయి. సూర్యోదయ తిథి కానీ, ప్రదోషిని వ్యాప్తి కలిగి ఉన్నప్పుడు కానీ కొన్ని పండుగలు, అలాగే తిథిగాని, నక్షత్రంగాని మధ్యాహ్న వ్యాప్తిని కానీ కలిగి ఉన్నప్పుడు కొన్ని పండుగలను ఆచరించాలని ధర్మగ్రంథాలలో పేర్కొన్నారు. అయితే పూర్వ కాలంనుండి నారదుడు, వరాహమిహీరుడు, ఆధిక్యుడు తదితరులు అందించిన నిర్ణయాలతో అనాదిగా అనుసరిస్తున్న పద్ధతిని (ఈ లెక్కల ఆధారంగానే అనాదిగా తిథి, నక్షత్రాదులను, గ్రహణాదులను సాధించడం) అనుసరించే పండుగల తేదీలను నిర్ణయించడం జరుగుతుంది. అయితే 1950 సంవత్సరంలో కొంతమంది ఎఫిమిరస్‌ను తయారు చేసి దృగ్గణితం పేరుతో గ్రహణాలు లెక్కించి పంచాంగ గణితం చేయవచ్చని చెప్పారు. ఆనాటినుండి కొందరు పంచాంగకర్తలు ఈ విధానాన్ని అభ్యాసం చేసి పంచాంగాలు తయారుచేస్తున్నారు. దీనివల్లే తిథి నక్షత్రాదులకు మధ్య వ్యత్యాసం వస్తోంది. ధర్మశాస్త్ర ప్రకారంగా సూర్యోదయానికి ఉండాల్సిన తిథి లేక మరో రోజుకో, ముందు రోజుకో ఉండడంవల్ల పండుగల తేదీలలో తారతమ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరికి వారు వారి లెక్కలను అనుసరించి పండుగలు చేయమంటున్నారు. ఆంధ్రా ప్రాంతంలో దృగ్గణితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ప్రకారం ఈసారి ఉగాది పండుగను ఈ నెల 28న చేయాలని కొందరు పండితులు అంటున్నారు. అయితే అనాదిగా వస్తున్న గణాంకాలను అనుసరించేవారు 29న సూర్యోదయానికి తిథి ఉన్నందున, అమావాస్యతో కూడిన పాడ్యమి పనికిరాదని, 29నే ఉగాది జరుపుకోవాలని చెబుతున్నారు. అనుభవజ్ఞులైన పంచాంగకర్తలు చాలామంది 29నే ఉగాది జరుపుకోవాలంటున్నారు. ఇదే సముచితమైంది.

- ఐనవోలు అనంత మల్లయ్యశర్మ సిద్ధాంతి వరంగల్ భద్రకాళీ దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి