ఫోకస్

గందరగోళం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమలంబ ఉగాది పర్వదినము జరుపుకొనేందుకు కొంతమంది సిద్ధాంతులు అవగాహనా రాహిత్యంతో, తప్పుడు నిర్ణయాలతో ప్రజలను గందరగోళపరుస్తున్నారు. తిథి, నక్షత్రాన్ని అనుసరించి పండుగల నిర్ణయం చేస్తారు. దీన్ని అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ, ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ వివరించారు. ఇక్కడ ధర్మశాస్తప్రరంగా ఎలాంటి బేధం లేదు. కాని గణితపరంగా (దృక్సిద్ధాంతం, పూర్వపద్ధతి) వచ్చే బేధాలు మాత్రమే ఈ గందరగోళానికి కారణం. దృక్సిద్ధాంతమనగా రవి చంద్రుల వాస్తవిక స్థితి తెలిపేది. దృక్సిద్ధాంతపరంగా గుణించినప్పుడు హేమలంబ సంవత్సరం మార్చి 28నే యుగాదిగా నిర్ణయింపబడినది. దీన్ని శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు మరియు ‘రాష్ట్రీయ పంచాంగం’లో ఆమోదించారు. దృక్సిద్ధాంత పద్ధతిలో పరిశీలిస్తే.. శ్రీ హేమలంబ చైత్ర శుక్ల పాడ్యమి మార్చి 28, 2017న ఉదయం 8.27 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే మార్చి 29 2017 సూర్యోదయానికి పూర్వమే ఉదయం 5.45 గంటలకు ముగుస్తుంది. మార్చి 29న సూర్యోదయం ఉదయం 6.09 గంటలకు అవుతుంది. అంటే సూర్యోదయానికి చైత్ర శుక్ల పాడ్యమి ఉండటం లేదు. ప్రత్యబ్ధ పంచాంగ సరళి అనే ప్రాచీన సిద్ధాంత గ్రంథంలో ‘చైత్ర శుక్ల పాడ్యమి చాంద్ర సంవత్సరాది ఉదయకాల ముహూర్తవ్యాపినీ గ్రాహ్యా’ అని చైత్ర శుక్ల పాడ్యమి ఉదయానికి ఉన్న రోజును మాత్రమే తీసుకోవలసిందిగా తెలిచేయబడినది. ఆ విధంగా చూస్తే పైన తెలుపబడిన వివరాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి మార్చి 28, 2017 అనగా మంగళవారంనాడు మాత్రమే అధికంగా వ్యాపించి ఉన్నది. అందువల్ల మార్చి 28 రోజునే ఉగాది జరుపుకోవడమే ఉచితమని నిర్ణయింపబడినది. దీన్ని కంచి కామకోటి పీఠాధిపతులు కూడా ఆమోదించారు. తెలంగాణ ప్రభుత్వం ఉగాదిని మార్చి 28 మంగళవారం రోజు ప్రకటించాలని కోరుతున్నాం. ప్రాచీన పద్ధతిని కనుక సమర్థిస్తే ఆ సిద్ధాంతుల తరఫున దృక్సిద్ధాంతం తప్పని వాదించి గెలిచి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బహుమానం పొందవచ్చు. అలా కాని పక్షంలో ప్రజలను గందరగోళపరిచే ప్రాచీన సిద్ధాంత పంచాంగాలను నిషేధించాలని కోరుతున్నాం.

- పాలకృత్తి నృసింహరామ సిద్ధాంతి, కాకతీయ పంచాంగ సిద్ధాంతకర్త