ఫోకస్

ఎందుకీ వివాదం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేద శాస్త్రానికి ఉన్న షడంగాల్లో జ్యోతిషం నయనస్థానానికి చెందింది. శాస్త్ర సహిత పండుగలు, కర్మలు చేయాల్సిన సమయాల్లో చేస్తేనే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. చేయకూడని సమయాల్లో చేస్తే విపరీత ఫలితాలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నపుడు సరైన సమయం అనే అంశంలో విభిన్నవాదనలు వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా పండుగల తేదీలు, సమయాలపై వివాదాలు పరిపాటి అయిపోయాయి. గత నాలుగైదేళ్లుగా ఈ ప్రస్తావన మరీ ఎక్కువగా ఉంది. గోదావరి పుష్కరాలు , కృష్ణా పుష్కరాలు, పండుగలు, శ్రీరామ నవమి తేదీలపై పెద్ద చర్చ జరిగింది. తాజాగా ఉగాదిపై కూడా ఈ చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం పంచాంగాలు పూర్వ పద్ధతి, దృగ్గణితం, ఉభయాత్మకం అనే మూడు రూపాల్లో కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ దృగ్గణితం కొద్ది సంవత్సరాలకు పూర్వం లేదు. అప్పుడు పూర్వపద్ధతి అనే పేరుండే అవకాశం కూడా లేదు. ఎప్పటికపుడు ఆకాశంలో కనిపించే అంశాలకు పోలిక చేసుకుంటూ లెక్కలు సవరించుకునేవారు. పూర్వపద్ధతి వారు దృక్ సిద్ధాంతం కళ్లకు కనిపించేదే అయినా అదృష్టరూపమైన ఫలితాలను ఇచ్చే యజ్ఞయాగాదులకు శ్రాద్ధాదులకు దృక్ గణితం వాడకూడదని లౌకికంగా ముహుర్తాదులకు, జాతకాదులకు దృక్ పద్ధతి వాడాలని కొందరంటారు.
జ్యోతిష మహాపండితుడు మధుర కృష్ణమూర్తి శాస్ర్తీ మాటల్లో చెప్పాలంటే దేశంలోని అన్ని పంచాంగాలకు సూర్య సిద్ధాంతమే ప్రమాణం. దీనిని అంగీకరించేవారున్నారు, కాదన్నవారూ ఉన్నారు. సూర్యుడు అశ్విని నక్షత్రం ప్రారంభ బిందువు నుండి బయలుదేరి తిరిగి అదే బిందువు వద్దకు చేరడానికి 365 రోజుల 15 ఘడియల 31 విఘడియల 31 పరల సమయం పడుతుంది. దీనినే మన భాషలో సౌరవర్షం అంటున్నాం. అయితే వర్తమానంలో వేధశాల ద్వారా పరిశీలిస్తే ఈ సౌరప్రమాణం 8 విఘడియల 30 పరల తేడా కనిపిస్తోంది. అంటే ఒక సంవత్సరానికి 3 నిమిషాల 24 సెకెన్లు తేడా వస్తుంది. ఈ తేడాలను లెక్కల్లోకి తీసుకోకుండా పంచాంగ గణనం చేయడం సరికాదు, దీనివల్లనే గ్రహ గమనాల్లో తేడాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయం. పంచాంగకర్తల సిద్ధాంతం ప్రకారం క్రీస్తుపూర్వం 499 నుండి ఈ తేడా కొనసాగుతోంది. దీంతో మనం మూడు రోజులు వెనుక ఉన్నామని తెలుస్తోంది. పంచాంగాల్లో ఏకీకరణ సాధించడానికి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1952లో కేలండర్ రిఫార్మ్సు కమిటీని ఏర్పాటుచేశారు. కార్యదర్శిగా నియమితులైన ఎన్‌సి లాహిరి తప్ప ఈ కమిటీలో జ్యోతిష శాస్త్రంలో కృషి చేసినవారు ఎవరూ లేరు. నక్షత్రగతుల గమనంలో మార్పువల్ల గ్రహగతుల్లో మార్పు కలుగుతూ ఉంటుందని, దీనివల్ల ఆయనాంశాన్ని మార్చాల్సి ఉంటుందని కమిటీ సమావేశాల్లో కొందరు సూచించారు. స్థిరమైన ఆయనాంశ అన్నది శాస్తవ్రిరుద్ధమని కొందరు తేల్చిచెప్పారు. ఆ వివాదానికి ఇంకా ముగింపు పడలేదు. సూర్యసిద్ధాంతంలోని త్రిప్రశ్నాధికారం, మాధ్యమాధికారం, స్పష్ట్ధాకారం మొదలైన అధ్యాయాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా మార్పులు చేసుకుని గ్రహగతులను నిర్ణయించాలని చెప్పడం జరిగింది. అలాగే సూర్యుడు, గ్రహాల గమనం అవి పయనించే వేగాన్ని బట్టి ముహుర్తాలు పెట్టాల్సి ఉంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి తేదీలను నిర్ణయించడం వివాదాస్పదం అవుతోంది. ఈ వివాదంపై పంచాంగకర్తల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.