ఫోకస్

సమస్య మళ్లీ మొదటికొస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాలయ నిర్మాణం సమస్యను కోర్టు వెలుపల పరిష్కరించుకుంటే తాము మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న సుప్రీం కోర్టు సలహా సరైంది కాదు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. నాటినుంచి ఏళ్లతరబడి కోర్టులో ఉన్న కేసును సుప్రీం కోర్టే స్వయంగా తీర్పునిస్తే బాగుంటుంది. సున్నితమైన ఈ అంశాన్ని కోర్టు వెలుపల పరిష్కారం లభించడం సాధ్యం కాదన్నదే నా అభిప్రాయం. ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు, మతపరమైన సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఈ వ్యవహారాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడవచ్చు. అయోధ్యలో రామమందిర నిర్మాణ సమస్య ఇరవై నాలుగేళ్లుగా వివిధ కోర్టుల్లో నలుగుతోంది. తొలుత అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వగా, ఈ తీర్పును సవాలు చేస్తూ రెండు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రామాలయ నిర్మాణ కేసులో రెండు వర్గాలు సంతృప్తి పడేవిధంగా తీర్పు వెలువడితే బాగుంటుంది. రాజకీయ పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. మైనార్టీ ఓట్లకోసం కొన్ని పార్టీలు, మెజార్టీ ఓట్లకోసం మరికొన్ని పార్టీలు గాలం వేస్తాయి. సుప్రీం కోర్టు మంచి సంకల్పంతో ఉన్నా కొన్ని సంస్థలు సమస్యను మరింత జటిలం చేసే ప్రమాదం ఉంది. కోర్టు వెలుపల పరిష్కరించుకునేంతటి గొప్ప భావాలుంటే, ఈ సమస్య ఇనే్నళ్లుగా నలిగేది కాదు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను రోజూవారీ చేపట్టి నిర్ణీత కాలపరిమితిలో తీర్పు వెలువరిస్తే బాగుంటుంది. కోర్టు తీర్పు వస్తే ఇక ఎవరూ ఆ తీర్పును శంకించకపోగా ఇరువర్గాలు కట్టుబడి ఉంటాయన్నది నా అభిప్రాయం. బాబ్రీ మసీదు-రామాలయం వివాదంవల్ల దేశంలో మతతత్వ భావాలు పెట్రేగి, హింస చెలరేగింది. వేలాదిమంది చనిపోయారు. రెండు వర్గాల్లో మతతత్వ అతివాద సంస్థలు పుట్టుకొచ్చాయి. దేశ భవిష్యత్తు, విశాల ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు త్వరితగతిన విచారణ పూర్తిచేసి అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు వెలువరిస్తే బాగుంటుంది.

- చాడ వెంకటరెడ్డి, తెలంగాణ సిపిఐ రాష్ట్ర శాఖ