ఫోకస్

కోర్టు పరిష్కరిస్తేనే మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్ధాల తరబడి భారతీయ సమాజంలో పరిష్కరించేందుకు వీలులేకుండా చిక్కుముడి పడిన అయోధ్య రామజన్మభూమి అంశంపై సుప్రీం కోర్టు స్వయంగా తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేది. కోర్టు వెలుపల పరిష్కారానికి చొరవ తీసుకుంటే మధ్యవర్తిత్వంకు సిద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు వెలుపల అత్యంత సున్నితమైన ఈ అంశానికి పరిష్కారం లభించడం అసాధ్యం. ఎందుకంటే రకరకాల రాజకీయ పార్టీలు, మతపరమైన సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఈ వ్యవహారాన్ని జఠిలం చేసేందుకు ప్రయత్నిస్తాయి. దీని వల్ల సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. 1949 నుంచి ఈ సమస్య రకరకాల రూపాల్లో కోర్టుల్లో నలుగుతోంది. చివరకు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునుసవాలు చేస్తూ రెండు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విషయంలో రెండు వర్గాల్లో సమస్య పరిష్కారమైతే బాగుంటుందనేవారున్నారు. మరి కొంత మంది రావణ కాష్టంలా ఈ సమస్య తగలబడాలని కోరుకునే వారుంటారు. రాజకీయ పార్టీల సంగతి చెప్పనలవి కాదు. మైనార్టీ ఓట్ల కోసం కొన్ని పార్టీలు, మెజార్టీ ఓట్ల కోసం మరి కొన్ని పార్టీలు గాలం వేస్తాయి. సుప్రీం కోర్టు మంచి సంకల్పంతోనే ఈ అంశంపై స్పందించింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాని కోర్టు వెలుపల పరిష్కరించుకునేంతటి గొప్ప భావాలుంటే, ఈ సమస్య 70 ఏళ్లుగా ఎందుకు నలుగుతుంది ? సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను రోజూవారీ చేపట్టి నిర్ణీత కాలపరిమితిలో తీర్పు వెలువరిస్తే బాగుంటుంది. కోర్టు తీర్పు వస్తే ఇక ఎవరూ ఆ తీర్పును శంకించరు. పైగా కట్టుబడి ఉంటారు. ఈ వివాదం వల్ల దేశంలో మతతత్వ భావాలు పెట్రేగి, హింస చెలరేగింది. 1991 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది మరణించారు. రెండు వర్గాల్లో మతతత్వ అతి వాద సంస్ధలు పుట్టుకొచ్చాయి. దేశ భవిష్యత్తు, విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు త్వరితగతిన విచారణ పూర్తి చేసి అందరికీ ఆమోదయోగ్యమైన, శ్రేయస్కరమైన తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాం.

కె శివకుమార్ వైకాపా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ శాఖ