ఫోకస్

ఇలాగయతే.. పంచాయితీ తెగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందిర వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఇలాగైతే పంచాయితీ ఎప్పటికీ తెగదు... ఎందుకంటే లోగడ పలు పర్యాయాలు ఇరు పక్షాలు కూర్చొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇన్ని సంవత్సరాలు కోర్టులో కేసు ఉన్నందున, ఇరు పక్షాలను సంతృప్తిపరిచే విధంగా తీర్పు వస్తుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురు చూశారు. ఇన్ని సంవత్సరాల విచారణ తర్వాత మీరే కోర్టు వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పడం దేశ ప్రజలను విభ్రాంతికి గురిచేసింది. సుప్రీం కోర్టు స్పెషల్ బెంచ్ ద్వారా త్వరితగతిన కేసును పరిష్కరించి ఉంటే బాగుండేది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడం లేదు కాబట్టే సుప్రీం కోర్టు వరకూ కేసు వచ్చింది. పైగా దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చినా తమకు ఆమోదయోగ్యమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశంలోని ముస్లిం మత పెద్దలు, సంస్థలు, ముస్లింలు అందరూ సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలనే భావించారు. తీర్పు ఎలా ఉన్నా, మళ్లీ కోర్టులో సవాల్ చేయబోమని కూడా స్పష్టం చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు వెలుపలే తేల్చుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? అనేది ప్రజలందరి ప్రశ్న. సుప్రీంకోర్టు చెప్పినట్లు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఎంతో కృషిచేసినా, ఫలితం రాకపోతే ఎలా? అప్పుడైనా మళ్లీ ‘సుప్రీం’నే ఆశ్రయించాల్సి ఉంటుంది కదా! ఇలాంటి సున్నితమైన, విపత్కరమైన సమస్యలను కోర్టులే పరిష్కరిస్తే, దానికి బద్ధులై ఉంటారు. అదే ప్రజాస్వామ్యంలోని గొప్పతనం.

- మహ్మద్ షబ్బీర్ అలీ, ప్రతిపక్ష నేత, తెలంగాణ కౌన్సిల్