ఫోకస్

సంక్షోభంలో న్యాయవ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల మధ్య ఏవైనా సమస్యలు వచ్చినా, మతపరమైన అంశాల్లో సామాజికంగా తేల్చలేకపోయిన సమస్యలు న్యాయ వ్యవస్థ ముందుకు వచ్చే సందర్భాల్లో న్యాయ వ్యవస్థ బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అయోధ్య అంశంపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడంలో ఉన్నత న్యాయస్థానం విఫలమైంది. కోర్టు వెలుపల పరిష్కరించుకోండంటూ సమాజంపైకి సమస్యను నెట్టివేసింది. దాంతో భారతీయ న్యాయ వ్యవస్థ సంక్షోభంలో పడ్డట్టే భావించవచ్చు. రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడాల్సిన కోర్టు తాము అశక్తులమంటూ ప్రకటించుకున్నట్టయింది. న్యాయమూర్తులు కుల, మతాలు, బాషాభేదాలకు అతీతులుగా ఉంటూ, విధి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ కృష్ణయ్యర్ లాంటి వారు న్యాయవ్యవస్థ ప్రమాణాలను ఉన్నతస్థితికి తీసుకెళ్లారు. సమస్య కోర్టు ముందుకు వస్తే న్యాయమూర్తులు తప్పించుకునే ధోరణిలో వ్యవహరించకుండా అందరికీ ఆమోదయోగ్యమయ్యే రీతిలో తీర్పు ఇస్తేనే కోర్టులంటే అందరికీ గౌరవం పెరుగుతుంది. రెండువర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని అవే వర్గాల చేతుల్లోకి పరిష్కారంకోసం నెట్టివేయడంలో ఔచిత్యం లేదు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థపట్ల ప్రజలకు గౌరవభావం ఉంది. ఎలాంటి సమస్య, వివాదం తలెత్తినా చట్టానికి లోబడి పరిష్కారం చూపిస్తాయనే నమ్మకం కోర్టులపై ప్రజలకు ఉంది. అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు స్వలాభంకోసం పనిచేస్తుంటాయి. ప్రజల ఓట్లకోసం అవసరమైతే ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకోగలుగుతాయి. కాని కోర్టుల పరిస్థితి వేరు. స్వప్రయోజనాలు అనేవి ఉండవు. అవసరమైతే రాజ్యాంగాన్ని, చట్టాలను సైతం ధ్వంసం చేసేందుకు రాజకీయ నేతలు ప్రయత్నిస్తుంటారు. అయితే కోర్టుల విషయం ఇందుకు భిన్నంగా ఉంటుంది. కోర్టుల ముందు ఉండేది కేవలం రాజ్యాంగం, చట్టాలు మాత్రమే. రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా అవి పనిచేయాల్సి ఉంటుంది. చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వారి తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది.
సమస్యల పరిష్కారాన్ని రెండు వర్గాలకే వదిలివేస్తే అరాచకం ఏర్పడేందుకు అవకాశాలు వస్తాయి. బలమైన వర్గం బలహీనమైన వర్గాన్ని అణచేందుకు ప్రయత్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్యాంగ ప్రమాణాలు దిగజారితే సమాజంలో అశాంతి నెలకొంటుంది. అలాంటి అశాంతి అనేక అనర్థాలకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కోర్టులపైనే ఉంటుంది.

-ప్రొఫెసర్ హరగోపాల్, సామాజిక శాస్తవ్రేత్త