ఫోకస్

గడువును నిర్దేశించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. దేశంలో భిన్న జాతులు, మతాలు ఉన్నప్పటికీ అంతా మానవజాతి అనే భావనతో ముందుకురావాలి. ఏ ఒక్క మతం గాని, రాజకీయ పార్టీగాని మొండిపట్టు పట్టరాదు. అన్ని మతాల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఓ వేదికపైకి వచ్చి మంచి వాతావరణంలో ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాంటపుడే భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడికి సార్థకత కలుగుతుంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సూచించడం శుభపరిణామం. అలాంటి నిర్ణయం తీసుకునేందుకు గడువును నిర్దేశించాలి. ఆ గడువులోగా ఆ సమస్యను పరిష్కరించుకోలేకపోతే కోర్టుద్వారా ఓ నిర్ణయం తీసుకోవాలి. అయోధ్య వివాదంలో మతాల మధ్య ఎలాంటి కుమ్ములాటలు లేకుండా ఉండాలి. ఏ దేవుడైనా ఎవరికైనా దేవుడేనన్న భావన ఉండాలి. జాతి అంతా ఒక్కటేనన్న ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకోవాలి. రాముడు, రహీం, అల్లా, సిక్కు, జీసస్ ఎవరైనా దేవుడేనన్న భావన ఉండాలి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా పెద్దలు నిర్ణయం తీసుకోవాలి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ మొండిపట్టు పట్టకుండా మంచి ఒడంబడిక చేసుకుంటే బాగుంటుంది. దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు ఉన్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఇనే్నళ్లుగా ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.

- బొత్స సత్యనారాయణ, వైకాపా రాష్ట్ర నాయకుడు