ఫోకస్

దేశ సమైక్యతను చాటడానికి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాలయం అంశంలో న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పడం ఒకవిధంగా మంచి పరిణామంగానే భావించాలి. దేశ సమైక్యత విషయంలో తామంతా ఒకటిగానే వ్యవహరిస్తామని హిందువులు, ముస్లింలు ప్రపంచానికి చాటి చెప్పడానికి దీనిని సదవకాశంగా తీసుకోవాలి. అయోధ్య సున్నితమైన అంశం కావడంతో ఇరువైపుల నుంచి ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా సహృద్భావంతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో హిందువులుగానీ, ముస్లింలుగానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సమస్య పరిష్కారంలో తమదే పైచేయగా ఉండాలని గానీ తమదే విజయమనిగానీ భావించకూడదు. దేశం అనేది రాజ్యాంగంపై ఆధారపడే నడుచుకుంటుంది తప్ప భావోద్వేగాలపై నడువదు. అయితే అయోద్య వివాదం సున్నితమైంది కావడంతో ఇరు వర్గాలు దేశ సమైక్యతా కోణం నుంచే ఆలోచించాలి. ఇరు వర్గాలు పరిపక్వతతో ఆలోచించాలి. న్యాయస్థానం వెలుపలనే పరిష్కారించుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన దానిని చాలా మటుకు ముస్లిం మత సంస్థలు స్వాగతించాయి కూడా. అయితే కొన్ని సంస్థలు మాత్రమే రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నాయి. అలా చేయడం వల్ల ఈ అంశం ఎప్పటికీ పరిష్కారం కాదు. రెచ్చగొట్టే వాళ్ల ఉద్దేశం కూడా ఎప్పటికీ పరిష్కారం కాకూడదనే. ఈ అంశాన్ని ఎలా పరిష్కారించుకుంటాయోనని ప్రపంచ దేశాలు కూడా మనవైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నా, దేశ సమైక్యత విషయానికి వస్తే తమంతా ఒక్కటేనన్న సంకేతాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి దీనిని సదావకాశంగా భావించాల్సిన అవసరం ఉంది.

- డాక్టర్ కస్పా బాల్‌రాజ్ అసోసియేట్ ప్రొఫెసర్, పిజి కాలేజి, సికింద్రాబాద్