ఫోకస్

అది సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కారించుకొనే ప్రయత్నం ఇది మొదటి సారికాదు. గతంలో ప్రయత్నాలు జరిగాయి, ఫలించలేదు. ఇప్పుడు కూడా అంతే.. చర్చలతో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు చర్చలద్వారా ఆయోధ్య సమస్యను పరిష్కరించుకోమని సూచించారు. దాంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, కమ్యూనిస్టు పార్టీలు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మేధావులు ఒక వర్గంగా, విశ్వ హిందూ పరిషత్ ఒక వర్గంగా చర్చలు ప్రారంభించారు. అయోధ్యలో రామాలయం ఉండేదని విశ్వహిందూ పరిషత్ ఆధారాలతో నిరూపించింది. విశ్వహిందూ పరిషత్ అన్ని రుజువులు చూపిన తరువాత చర్చల మధ్యలోనే ఆల్ ఇండియా ముస్లిం ప్రతినిధులు చర్చలనుంచి లేచి వెళ్లిపోయారు. లక్నో కోర్టులో ఆయోధ్య అంశం విచారణకు వచ్చినప్పుడు ఇది భూ వివాదం అని ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదన. దేవాలయం ఉందని విశ్వ హిందూ పరిషత్ ఆధారాలు చూపించింది. విశ్వ హిందూ పరిషత్ న్యాయస్థానాల్లో, బయట చర్చల్లో అన్ని ఆధారాలు చూపినా ముస్లిం ప్రతినిధులు అంగీకరించలేదు. చివరకు కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ ప్రాంతాలకు చెందిన 15వేల మంది ముస్లిలు సంతకాలు చేశారు. కమ్యూనిస్టులు, జెఎన్‌యు వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు. చర్చలతో పరిష్కారం అయ్యేది కాదని ఓవైసీ కూడా అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం రామాలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్‌కు, ఒక భాగం మఠానికి, మరో భాగం అక్కడ ముస్లిం సంస్థకు అప్పగించే విధంగా లక్నో హైకోర్టు సూచించింది. అయితే దీన్ని ముస్లిం సంస్థలు ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ చర్చలద్వారా పరిష్కరించుకోండి అని సుప్రీంకోర్టు చెప్పినా ఇదే పునరావృతం అవుతుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో రామాలయ నిర్మాణంకోసం అసెంబ్లీ తీర్మానం చేయవచ్చు. అయితే దీనిపై మళ్లీ కోర్టు స్టే ఇచ్చే అవకాశం ఉంది. బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి చెప్పిన దాని ప్రకారం రాజ్యసభలోనూ బిజెపికి మెజారిటీ వచ్చిన తరువాత అవసరం అయితే రాజ్యాంగ సవరణ చేసి రామాలయాన్ని నిర్మిస్తారు. దేశంలోని సగం రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయి. రాజ్యసభలోనూ బిజెపికి మెజారిటీ వచ్చింది. అద్వానీ రాష్టప్రతిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రాష్టప్రతి ఎన్నికల తరువాత రెండు సభల్లోనూ పూర్తి మెజారిటీ ఉన్న బిజెపి రాజ్యాంగ సవరణతోనైనా రామాలయాన్ని నిర్మిస్తుంది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, హిందువులకు రాలేదు. ఇప్పుడు హిందువులు తమకు స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారు. అందుకే ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో బిజెపి విజయం సాధిస్తోంది.

త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి